సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇప్పుడు మీరు కూడా Pan India Star అనుకుంటున్నారా..? అన్న నెటిజన్ ప్రశ్నకు Adivi Sesh దిమ్మతిరిగే సమాధానం.

ABN, First Publish Date - 2022-05-26T22:00:49+05:30

నటనతో పాటు కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకునే నటుడు అడివి శేష్ (Adivi Sesh). ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’ (Major). సయిూ మంజేక్రర్ హీరోయిన్‌గా నటించారు. శశి కిరణ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటనతో పాటు కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకునే నటుడు అడివి శేష్ (Adivi Sesh). ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మేజర్’ (Major). సయిూ మంజేక్రర్ హీరోయిన్‌గా నటించారు. శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు (Mahesh Babu) సొంత నిర్మాణ సంస్థ జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పాన్ ఇండియాగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘మేజర్’ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు కూడా అడివి శేష్ సమాధానాలిస్తున్నారు. 


‘మేజర్’ పాన్ ఇండియాగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో .. ఇప్పుడు మీరు కూడా పాన్ ఇండియా స్టార్ అనుకుంటున్నారా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అందుకు అడివి శేష్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ‘‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆల్ ఇండియన్ హీరో అని నేను అనుకుంటున్నాను’’ అని అడివిశేష్ చెప్పారు. శేష్ ఇచ్చిన సమాధానంతో అభిమానులందరు ఫిదా అయ్యారు. ‘‘అద్భుతమైన సమాధానం ఇచ్చావు శేష్ అన్న’’ అని ఓ నెటిజన్ చెప్పారు. ‘‘మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నేషనల్ హీరో లేదా అంతకంటే ఎక్కువే. కానీ, శేష్ మాత్రం పాన్ ఇండియా స్టారే’’ అని మరో నెటిజన్ తెలిపారు.  




Updated Date - 2022-05-26T22:00:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!