మహేశ్‌బాబు టైమింగ్‌ మాములుగా ఉండదు

ABN , First Publish Date - 2022-05-12T09:49:25+05:30 IST

మహేశ్‌బాబు నటించిన ‘సర్కారువారి పాట’ చిత్రం గురువారం విడుదలవుతోంది. ఈ చిత్రంలో కథానాయుకగా నటించిన కీర్తి సురేశ్‌ ఈ సందర్భంగా చిత్రజ్యోతితో ప్రత్యేకంగా...

మహేశ్‌బాబు టైమింగ్‌ మాములుగా ఉండదు

మహేశ్‌బాబు నటించిన ‘సర్కారువారి పాట’ చిత్రం గురువారం విడుదలవుతోంది. ఈ చిత్రంలో కథానాయుకగా నటించిన కీర్తి సురేశ్‌ ఈ సందర్భంగా చిత్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు. 


‘కళావతి నాకో బహుమతి’ అన్నారు. అంతలా ఏం నచ్చింది?

చాలా డిఫరెంట్‌ క్యారెక్టర్‌. ఇలాంటి క్యారెక్టర్‌ మళ్లీ చేయలేను. నేను అలా ఎందుకన్నానో మీకు సినిమా చూశాక అర్థమవుతుంది. క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్‌తో  పాటు నటనకు ఆస్కారముంది. నాకు చాలా నచ్చిన పాత్ర ఇది. 


కళావతి లాంటి మాస్‌ ఛాయలున్న పాత్ర ఇప్పటిదాకా చేయకపోవడానికి కారణం?

ఈ తరహా పాత్ర నా దగ్గరకు రావడం ఇదే తొలిసారి. తమిళంలో చేశాను. తెలుగులో ‘మహానటి’ తర్వాత ఇలాంటి పాత్రలు రావడానికి కొంచెం టైం పట్టింది. 


మీ లవ్‌ట్రాక్‌కు రిపీట్‌ ఆడియన్స్‌ ఉంటారని మహేశ్‌ అన్నారు? 

ఆయనతో నటించడం నాకు తొలిసారి. అయినా మా మధ్యన కెమిస్ట్రీ బాగా పండింది. మేమిద్దరం  మా గత చిత్రాలకు భిన్నంగా ఉండే పాత్రలు చేశాం. 


మహేశ్‌బాబుతో నటించడం ఎలా ఉంది?

చాలా సంతోషంగా ఉంది. ఆయనొక స్వీట్‌ పర్సన్‌.  సింపుల్‌గా ఉంటారు. మేమిద్దరం సెట్‌లో ఎన్నో విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆయన ఓపిగ్గా ఉంటారు. మహేశ్‌తో పని చేయడం ఒక అందమైన జర్నీ. 


మహేశ్‌తో లవ్‌ట్రాక్‌ చేయడం ఎలా ఉంది?

వెరీ నైస్‌. అదొక సెపరేటు ట్రాక్‌ కాదు. స్టోరీలో భాగంగానే ఉంటుంది. స్టైలింగ్‌, కాస్ట్యూమ్స్‌ అన్నీ డిఫరెంట్‌గా ట్రై చేశాను. 


ఈ సినిమాలో ఏది సవాల్‌గా అనిపించింది?

ఇందులో బబ్లీ క్యారెక్టర్‌ కాబట్టి కొంచెం ఫన్‌ ఉంటుంది. ఏ పాత్రలో అయినా నటిగా మనం ఎంతవరకూ పెర్‌ఫార్మ్‌ చేయాలో అంతవరకూ చేయాల్సిందే. ఇలాంటి పాత్రలు చేయడం కూడా ఒకింత సవాలే. ప్రేక్షకులను నవ్వించడం, యాస పలకడం కోసం ఒకింత కష్టపడ్డాను. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. 


మ...మ...మహేశ్‌ సాంగ్‌ గురించి 

అది అభిమానులందరికి నచ్చే పాట. వెరీ నైస్‌, క్యాచీసాంగ్‌. ఆ సాంగ్‌కు థియేటర్‌ అదిరిపోతుంది అనుకుంటాను. ప్రతి ఒక్కరూ లేచి డ్యాన్స్‌ చేస్తారు. శేఖర్‌ మాస్టర్‌ మంచి మూమెంట్స్‌ క్రియేట్‌ చేశారు. తెలుగులో ఇలాంటి మాస్‌ సాంగ్‌ చేయడం నాకు ఇదే తొలిసారి. చాలా హ్యాపీగా ఉంది. 


ఈ సినిమాతో మాస్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ రావడం ఎలా అనిపిస్తోంది?

మార్పు నాకు ఇష్టం. ‘మహానటి’ చేసేముందు నేను ఆ పాత్రకు న్యాయం చేయగలను అని అనుకోలేదు. ఇలాంటి ఆఫర్‌ వచ్చినప్పుడు మనం ఏం చేయగలమో చూపించాలి. నేను అన్ని రకాల పాత్రలను టచ్‌ చేయాలని అనుకుంటున్నాను.  నాలో కొత్తకోణాన్ని ప్రేక్షకులు చూస్తారు.


కరోనా టైమ్‌లో షూటింగ్‌ చేశారు. ఎలా అనిపించింది?

సినిమా కొంతభాగం కరోనా టైంలోనే షూట్‌ చేశాం. అయితే కరోనా భయం మనలో ఉంటే పాత్రలోనూ అదే రిఫ్లెక్ట్‌ అవుతుంది. అందుకే భయాన్ని పక్కన పెట్టి సరదాగా చిత్రీకరణ చేశాం. 


‘సర్కారు...’, ‘సాని కాయిదమ్‌’.. రెండు విభిన్నమైన పాత్రలు.. 

డీ గ్లామర్‌ రోల్స్‌, ఛాలెంజింగ్‌ పాత్రలు చేయడం నాకు చాలా ఇష్టం. సాదాసీదా మహిళగా, గ్లామర్‌ తారగా ఇలా విరుద్ధంగా ఉండే పాత్రలు చేశాను. రెండు సినిమాలు ఒకే టైమ్‌లో విడుదలవడం నటిగా నాకు ఆనందాన్నిచ్చింది. 


మాతృభాష మలయాళంలో చాలా కాలం తర్వాత ‘వాషి’లో లీడ్‌రోల్‌లో చేస్తున్నారు. ఇంత గ్యాప్‌ ఎందుకు వచ్చింది?

మద్యలో ఆఫర్లు వచ్చినా మలయాళంలో చేయలేకపోయాను. అక్కడ చాలా త్వరగా షూట్‌ చేస్తారు. ఇక్కడ చాలా టైమ్‌ తీసుకుంటారు. దానివల్ల అక్కడ సమయం కేటాయించలే కపోయాను. దర్శకుడు నా పాత్రను మలచిన తీరు బాగా నచ్చింది. నాకు కుదిరినప్పుడే   చిత్రీకరణకు అంగీకరించారు.  


రజనీకాంత్‌, చిరంజీవి లాంటి ఇద్దరు అగ్రహీరోలకు చెల్లెలు అయ్యారు? వారితో పనిచేయడం ఎలా ఉంది. 

వారిద్దరితో నటించే అవకాశం దొరకడమే గొప్ప అదృష్టం. ఇప్పుడు మిస్‌ చేసుకుంటే మళ్లీ ఎప్పుడు దొరుకుతుందో. అందుకే వెంటనే ఎస్‌ చెప్పాను. 


ఓటీటీ ప్రాజెక్ట్‌లు ఏవైనా చేయాలనుకుంటున్నారా?

కథ ఆసక్తికరంగా అనిపిస్తే తప్పకుండా చేస్తాను. 


దసరాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

అందులో నా పాత్ర చాలా మాసీగా ఉంటుంది. చాలా వేరియషన్స్‌ ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేయని పాత్ర. 


పరశురామ్‌గారు ఈ చిత్రకథ చెప్పగానే చాలా ఎక్సయిట్‌ అయ్యాను. ఎందుకంటే ఇటువంటి పాత్ర ఇంతకుముందు చేయలేదు. పరశురామ్‌గారి చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ‘సర్కారువారి పాట’ సినిమాలో కూడా కళావతి పాత్ర కీలకం. ఇంత పెద్ద కమర్షియల్‌ చిత్రంలో అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం నిజంగా అదృష్టం. సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని కథ వినగానే చెప్పా.


మహేశ్‌బాబు టైమింగ్‌ మాములుగా ఉండదు. సెట్‌లో చాలా సైలెంట్‌గా పంచ్‌లు పేలిపోతుంటాయి. ‘సర్కారువారి పాట’ షూటింగ్‌ చాలా సరదాగా జరిగింది. చివరగా షూట్‌ చేసిన పాటను కూడా చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. ఆయనతో పనిచేయడం వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌.


నా కెరీర్‌లో ఒక సాంగ్‌ ఇంత పెద్ద హిట్‌ కావడం ‘కళావతి’ తోనే జరిగింది 150 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేయడం అంటే మాటలు కాదు. 


Updated Date - 2022-05-12T09:49:25+05:30 IST

Read more