తారక్‌–చరణ్‌ స్టార్‌డమ్‌ను దాటిపోయారు.. జక్కన్నకే ఇది సాధ్యం: మహేశ్‌!

ABN , First Publish Date - 2022-03-26T23:43:55+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలతో నాలుగేళ్ల ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అద్భుతమైన చిత్రాన్ని అందించిన రాజమౌళికి భాషతో సంబంధం లేకుండా సినీ ప్రముఖులు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మహేశ్‌ ఈ చిత్రాన్ని వీక్షించి ట్విట్టర్‌ వేదికగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు అభినందనలు తెలిపారు.

తారక్‌–చరణ్‌ స్టార్‌డమ్‌ను దాటిపోయారు.. జక్కన్నకే ఇది సాధ్యం: మహేశ్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలతో నాలుగేళ్ల ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అద్భుతమైన చిత్రాన్ని అందించిన రాజమౌళికి భాషతో సంబంధం లేకుండా సినీ ప్రముఖులు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మహేశ్‌ ఈ చిత్రాన్ని వీక్షించి ట్విట్టర్‌ వేదికగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘‘ఎన్నో చిత్రాలు ఉంటాయి. అందులో రాజమౌళి సినిమాలూ ఉన్నాయి.  వాటిలో ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎపిక్‌. సినిమా స్కేల్‌, గ్రాండియర్‌, అద్భుతమైన విజువల్స్‌, గుండెలు పిండే భావోద్వేగాలు,  సంగీతం ఊహకు అందని స్థాయిలో ఉన్నాయి. కథను అద్భుతంగా చెప్పడంలో మాస్టర్‌ అయిన రాజమౌళికే ఇలాంటివి సాధ్యం. ఈ తరహా సెన్సేషన్స్‌ క్రియేట్‌ చేయగలిగే ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. తారక్‌, రామ్‌చరణ్‌, స్టార్‌డమ్‌ను దాటి వెళ్లిపోయారు. వారి ప్రతిభ ప్రపంచ హద్దులు దాటిపోయింది. ‘నాటునాటు’  పాటకు వేసిన స్టెప్పులు చూసి గాల్లో తేలిపోతూ వేశారేమో అనిపించింది. ప్రేక్షకులకు కనులువిందైన సినిమా ఇచ్చినందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు కృతజ్ఞతలు అంటూ వరుస ట్వీట్లు చేశారు మహేశ్‌. 

Updated Date - 2022-03-26T23:43:55+05:30 IST