పోకిరి విడుదలైన రోజే...!
ABN , First Publish Date - 2022-08-20T05:30:00+05:30 IST
ఏప్రిల్ 28.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి చాలా స్పెషల్. ఆ రోజే.. ‘పోకిరి’ విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.

ఏప్రిల్ 28.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి చాలా స్పెషల్. ఆ రోజే.. ‘పోకిరి’ విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రతీ యేటా ఏప్రిల్ 28న ‘పోకిరి’ని గుర్తు చేస్తూ ఓ పండగలా జరుపుకొంటారు. ఇప్పుడు మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా కూడా అదే రోజున రాబోతోంది. మహేశ్ - త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ చిత్రానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పుడు రిలీజ్ డేట్‌ని సైతం నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించేసింది. 2023 ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. మహేశ్ నటిస్తున్న 28వ చిత్రాన్ని 28న విడుదల చేస్తుండడం విశేషం. హారిక, హాసిని క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తోంది. ఎస్.రాధాకృష్ణ నిర్మాత. పూజా హెగ్డే కథానాయిక. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: పి.ఎ్‌స.వినోద్.