ఒక్కరోజులోనే 30 ప్రాణాలను కాపాడిన మహేశ్..

ABN , First Publish Date - 2022-04-08T14:34:40+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఇప్పటికే వేల ప్రాణాలను తన సొంత డబ్బుతో చిన్నారులకు గుండే ఆపరేషన్ చేయించి కాపాడిన మహేష్ ..తన పేరు

ఒక్కరోజులోనే 30 ప్రాణాలను కాపాడిన మహేశ్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఇప్పటికే వేల ప్రాణాలను తన సొంత డబ్బుతో చిన్నారులకు గుండే ఆపరేషన్ చేయించి కాపాడిన మహేష్ ..తన పేరు మీద ప్రారంభించిన ఫౌండేషన్ ద్వారా తన సహాయా సహకారాలను మరింతగా విస్తరింపజేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరో అద్భుతమైన కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు. 


ఈ ప్రత్యేకమైన రోజున ఏకంగా 30 మంది చిన్నారుల గుండెలకి ఊపిరి పోసి వారి కుటుంబాలలో కొత్త వెలుగులు నింపారు. తాజాగా ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ గవర్నర్‌కు అలాగే, ఆంధ్ర రాష్ట్ర ఆసుపత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేష్ అభిమానులు మారోసారి తమ అభిమాన హీరో చేసిన ఈ గొప్ప కార్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమ్రత పెట్టిన ఈ పోస్టును సోషల్ మీడియాలో పంచుతూ వైరల్ చేస్తున్నారు. కాగా, మహేశ్ ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. Updated Date - 2022-04-08T14:34:40+05:30 IST

Read more