మహేశ్ ఆకలి తీర్చారు
ABN , First Publish Date - 2022-11-17T09:33:42+05:30 IST
తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణను కడసారి చూసుకునేందుకు ఆయన అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చారు...

తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణను కడసారి చూసుకునేందుకు ఆయన అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చారు. జనం బారులు తీరడంతో కృష్ణ పార్దివదేహాన్ని చూడడానికి చాలా సమయం పట్టింది. మధ్యాహ్నం కావడంతో భోజన సదుపాయం లేక అభిమానులు ఇబ్బంది పడుతున్నారనే విషయం గమనించిన మహేశ్‌బాబు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ‘కృష్ణ చివరిచూపు కోసం వచ్చిన అభిమానులు ఎవరూ ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్ అందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు. అంత విషాదంలోనూ మహేశ్ మా ఆకలి తీర్చారు’ అని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో మహేశ్‌బాబును ప్రశంసించారు.