సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్విట్జర్లాండ్‌లో మహేశ్‌... న్యూయార్క్‌లో ఎన్టీఆర్‌... హాలీడేస్‌... జాలీడేస్‌

ABN, First Publish Date - 2022-12-28T02:52:12+05:30

అగ్ర హీరోలు క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకల ఉత్సాహంలో ఉన్నారు. కొత్త సినిమాల సెట్స్‌లోకి వెళ్లేముందు తమ కుటుంబంతో విదేశాల్లో సరదాగా గడుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్ర హీరోలు క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకల ఉత్సాహంలో ఉన్నారు. కొత్త సినిమాల సెట్స్‌లోకి వెళ్లేముందు తమ కుటుంబంతో విదేశాల్లో సరదాగా గడుపుతున్నారు. మరోసారి మహేశ్‌బాబు తమ కుటుంబంతో విదేశాలకు వెళ్లారు. భార్య నమ్రతా శిరోద్కర్‌, తనయుడు గౌతమ్‌, కుమార్తె సితారతో కలసి స్విట్జర్లాండ్‌లో గడుపుతున్నారు. అక్కడి సుందర నగరం లూజర్న్‌లో కుటుంబంతో కలసి క్రిస్మస్‌ ట్రీముందు నిల్చొని దిగిన ఫొటోను మహేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అయింది. ‘మో లూజర్న్‌... నేను మీ అభిమానిని’ అంటూ ఆ నగరంపైన ఉన్న ఇష్టాన్ని మహేశ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. తొలి షెడ్యూల్‌ పూర్తయింది. విదేశాల నుంచి తిరిగిరాగానే తదుపరి షెడ్యూల్‌లో పాల్గొంటారు.

ఎన్టీఆర్‌ కూడా తన కుటుంబంతో కలసి విదేశీ టూర్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌ వీధుల్లో సరదాగా షికార్లు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తారక్‌ సతీమణి లక్ష్మీప్రణతి కూడా ఈ టూర్‌ను ఆస్వాదిస్తున్నారు. న్యూయార్క్‌లోని ఓ మెయిన్‌ రోడ్డులో ఇద్దరూ కలసి దిగిన ఫొటోను ఎన్టీఆర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు సోషల్‌ మీడియాలో అభిమానులను అలరించారు. తల్లిదండ్రులు కాబోతున్న విషయం ప్రకటించినప్పటి నుంచి వారికి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిగా ఉపాసన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్‌, తన పెంపుడు కుక్కపిల్లతో కలసిదిగిన ఫొటోను ఆమె షేర్‌ చేశారు. ‘మీ ప్రేమకు మా కృతజ్ఞతలు అని’ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-12-28T02:52:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!