మహేష్ బాబు రివీల్ చేసిన Mahaveerudu టైటిల్
ABN , First Publish Date - 2022-07-16T02:32:24+05:30 IST
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా.. మడోన్ అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా (Arun Viswa) నిర్మాణంలో ఓ ఇంటెన్స్

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా.. మడోన్ అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా (Arun Viswa) నిర్మాణంలో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్‌ను శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu).. తన ట్విట్టర్ వేదికగా ఆవిష్కరించి, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగులో ఈ చిత్రానికి ‘మహావీరుడు’ (Mahaveerudu) అనే టైటిల్‌ను ఖరారు చేయగా, తమిళ వెర్షన్‌కు ‘మావీరన్’ (Maaveeran) అనే టైటిల్‌ను పెట్టారు. “శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న ‘మహావీరుడు’ టైటిల్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది! మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు’’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో మైండ్ బ్లోయింగ్‌గా వుంది. ఇందులో శివకార్తికేయన్‌ను తాళ్లతో కట్టగా.. ఆయన అలా కట్లుతోనే విలన్స్‌ని స్టయిలీష్‌గా కొట్టడం డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఆలోచన చాలా కొత్తగా ఉండగా, క్యారికేచర్ స్టిల్‌తో టైటిల్ రివీల్ కావడం మరింత రెఫ్రెషింగ్‌గా వుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో శివకార్తికేయన్ అవుట్ స్టాండింగ్‌గా కనిపించారు. కాగా, భరత్ శంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విధు అయ్యన్న డీవోపీగా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.