Mahesh Babu: వరస విషాదాలు తో ఎలా తట్టుకుంటున్నాడో పాపం....

ABN , First Publish Date - 2022-11-15T19:09:47+05:30 IST

కృష్ణ గారి పార్థివ దేహానికి చూడటానికి వచ్చిన అభిమానులు, పరిశ్రమలోని వారు అక్కడ పార్థివ దేహం పక్కన నిలుచున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Mahesh Babu: వరస విషాదాలు తో ఎలా తట్టుకుంటున్నాడో పాపం....

కృష్ణ గారి పార్థివ దేహానికి చూడటానికి వచ్చిన అభిమానులు, పరిశ్రమలోని వారు అక్కడ పార్థివ దేహం పక్కన నిలుచున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. పాపం మహేష్ బాబు ఎలా తట్టుకుంటున్నాడో, పగవాడికి కూడా వద్దురా బాబూ ఇంతటి విషాదం అని అంటున్నారు.  ముందు అన్నయ్య రమేష్ బాబు కాలం చేసారు, అన్నయ్య అంటే పంచ ప్రాణాలు మహేష్ బాబు కి. తనకి అత్యంత ఆప్తుల్లో రమేష్ అన్నయ్య ఒకడు. కృష్ణ గారి కన్నా ఎక్కువ ప్రేమించే అన్నయ్య పోయాడు. పోనిలే అని ఎదో దుఃఖం దిగమింగుతూ వున్నాడు అనుకునేలోపే, పాపం తల్లి ఇందిరాదేవి రెండు నెలల క్రితం చనిపోయారు. తల్లితో ప్రతి రోజూ మాట్లాడే మహేష్ బాబు ప్రేమించే ఇంకో వ్యక్తి ఆమె. అలాంటి తల్లి పోవడం తో తల్లడిల్లిపోయాడు. తట్టుకోలేక పోయాడు. పాపం మహేష్ బాబు కి ఏంటి ఇంతటి విషాదం అనుకున్నారు. 


అక్క చెల్లెలు, తండ్రి అక్కున చేర్చుకొని మేమున్నాం పరవాలేదు అని సపోర్ట్ గ నిలిచారు. కానీ ఇంతలోనే మరో ఘోరం. తండ్రి హీరో కృష్ణ గారు హఠాన్మరణం. తల్లి పోయి ఇంకా రెండు నెలలు కూడా అవలేదు, అంతలోనే తండ్రి చెట్టంత మనిషి కృష్ణ గారు మరణించటం తో పాపం మహేష్ ఎలా తట్టుకుంటున్నాడు, ఇన్ని విషాదాలు అని అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇలా ముగ్గురు తన జీవితం లోని అత్యంత ప్రధాన వ్యక్తులు తనకి దూరం అవటంతో మహేష్ ఎలా తట్టుకోగలడు  అని పరిశ్రమలోని వారు అభిమానులు మహేష్ కి ధైర్యం చెపుతూ వస్తున్నారు. ఎవరు ఎంత చెప్పిన, మహేష్ దుఃఖం అయితే తీరేది కాదు. కానీ తట్టుకొని నిలబడ గలగాలి. ఇప్పటికే తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న మహేష్, తన తండ్రి ఆశయాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. (#MaheshBabu #KrishnaGaru #SuperstarKrishna #SSMB)

Updated Date - 2022-11-15T19:09:47+05:30 IST