సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ ఓటీటీకే Sarkaru Vaari Paata డిజిటల్ రైట్స్

ABN, First Publish Date - 2022-05-13T01:34:03+05:30

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. మే 12న విడుదలైన ఈ మూవీ అభిమానులను విపరీతంగా అలరిస్తుంది. ఇప్పటికే యూఎస్ఏ‌లో వన్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం తొలిరోజు కొన్ని ఏరియాల్లో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్సయింది.


‘సర్కారు వారి పాట’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) దక్కించుకుంది. జూన్ రెండో వారం లేదా మూడో వారం నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సౌత్ ఇండస్ట్రీ‌ సినిమాలపై దృష్టి సారించిందని సమాచారం. అందుకే దక్షిణాదికి చెందిన పలు చిత్రాల హక్కులను ఈ ప్లాట్‌ఫాం సొంతం చేసుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. యశ్ (yash) హీరోగా నటించిన ‘కెజియఫ్: చాప్టర్-2’ (KGF: Chapter 2)డిజిటల్ రైట్స్‌ను ఈ ప్లాట్‌ఫామే సొంతం చేసుకోవడం గమనార్హం. ‘సర్కారు వారి పాట’ లో కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్‌గా నటించింది. పరశురాం దర్శకత్వం వహించాడు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది.

Updated Date - 2022-05-13T01:34:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!