Mahesh Babu: షర్ట్‌లెస్ మహేశ్.. లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా!
ABN , First Publish Date - 2022-08-20T22:55:28+05:30 IST
మహేశ్‌బాబు అందగాడు, ఛార్మింగ్ హీరో అన్నది తెలిసిందే! అయనకు సిగ్గు కూడా ఎక్కువే! షర్టు లేకుండా బాడీ చూపించడం వంటి సన్నివేశాలు చేయడానికి ఇష్టపడరు. ఒక వేళ అలాంటి సన్నివేశాలు ఉన్నా పరిధిలోనే చేస్తారు. ప్రస్తుతం ఆయన తాజా ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

మహేశ్‌బాబు (Mahesh babu)అందగాడు, ఛార్మింగ్ హీరో అన్నది తెలిసిందే! అయనకు సిగ్గు కూడా ఎక్కువే! షర్టు లేకుండా బాడీ చూపించడం వంటి సన్నివేశాలు చేయడానికి ఇష్టపడరు. ఒక వేళ అలాంటి సన్నివేశాలు ఉన్నా పరిధిలోనే చేస్తారు. ప్రస్తుతం ఆయన తాజా ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల స్విమ్మింగ్ పూల్‌లో షర్ట్ లేకుండా స్విమ్ సూట్‌లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు నమ్రతా(Namratha). ‘‘కొన్నిసార్లు సాటర్‌డే మార్నింగ్ ఇలా ఉంటాయి’ అని నమ్రత శిరోద్కర్ రాసుకొచ్చారు. ఈ ఫోటోల్లో మహేశ్ కండలు తిరిగిన శరీరం, గడ్డంతో ఉన్న ట్రెండీ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విహారానికి వెళ్లిన సమయంలో అక్కడ కుటుంబంతో గడిపిన జ్ఞాపకాల్ని ఫొటోల రూపంలో షేర్ చేస్తుంటారు. ఇలా షర్ట్‌లెస్ ఫొటోను షేర్ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు అంతా ‘మహేష్.. పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆసక్తికరంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. (Mahesh babu shirtless pic viral)
మహేష్ బాబు తదుపరి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకెళ్లనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. పూజాహెగ్డే కథానాయిక.
