సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mahesh Babu: బాలీవుడ్‌ను అవమానించలేదు

ABN, First Publish Date - 2022-05-12T00:24:07+05:30

బాలీవుడ్‌ (Bollywood)ను తక్కువ చేసి మాట్లాడాలని కానీ, బాలీవుడ్‪ని అవమానించాలని కానీ.. తనకు లేదని సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన పీఆర్ టీమ్ ద్వారా మీడియాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ (Bollywood)ను తక్కువ చేసి మాట్లాడాలని కానీ, ఆ ఇండస్ట్రీని అవమానించాలని కానీ.. తనకు లేదని సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన పీఆర్ టీమ్ ద్వారా మీడియాకు తెలియజేశారు. అంతకు ముందు అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన ‘మేజర్’ (Major) ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‪లో మహేష్ బాబు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఏ ప్లస్ ఎస్ మూవీస్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ తో కలిసి తన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (GMB Entertainment) బ్యానర్‪లో మహేష్ బాబు నిర్మించారు. ‘మేజర్’ ట్రైలర్ విడుదల నిమిత్తం జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు.. తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు.


బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘తెలుగు ఇండస్ట్రీని (Tollywood) విడిచి ఇతర ఇండస్ట్రీలలో పనిచేయాలనే ఆలోచన లేదు. తెలుగు సినిమాలతోనే మరింత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నాను. టాలీవుడ్‌లో నాకు ఉన్న ఆదరణ, ప్రేమాభిమానాల గురించి మాటల్లో చెప్పలేను. వాటిని వదులుకొని వేరే పరిశ్రమ వైపు వెళ్లాలనే ఆలోచన నాకు లేదు. మొదటి నుంచి నేను తెలుగు ఇండస్ట్రీ అని చెబుతున్నాను. బాలీవుడ్‌ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ నన్ను భరించలేదు. అక్కడికి వెళ్లి సమయాన్ని వృధా చేసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే బాలీవుడ్ వద్దనుకున్నా. తెలుగు సినిమాలే నా బలం’’ అని మహేష్ అన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు దర్శనమిచ్చాయి. దీంతో అలెర్ట్ అయిన మహేష్ పీఆర్ టీమ్ (Mahesh PR Team) స్పందించింది.


‘‘మహేష్ బాబు చెప్పిన మాటల్ని బాలీవుడ్ మీడియా వక్రీకరించి చూపిస్తుంది. మొదటి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తున్నాను కాబట్టి.. ఇక్కడే తనకి సౌకర్యవంతంగా ఉంటుందని మహేష్ అన్నారు. తెలుగు సినిమాలను చేసేందుకు ఇష్టపడతానన్నారు తప్ప.. బాలీవుడ్‪ని ఎక్కడా అవమానించలేదు. తక్కువ చేసి కూడా మాట్లాడలేదు. ఆయనకి అన్ని భాషలపై గౌరవం ఉంది. దయచేసి ఆయన అనని మాటలను అన్నట్లుగా క్రియేట్ చేయవద్దు. త్వరలో రాజమౌళి (Rajamouli)తో చేసే సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఉంటుందని గమనించగలరు..’’ అని మహేష్ పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. కాగా, మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) చిత్రం.. రేపు (మే 12) ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. 

Updated Date - 2022-05-12T00:24:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!