సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సోదరుని పెద్దకర్మకి హాజరైన మహేష్ బాబు

ABN, First Publish Date - 2022-01-22T22:27:56+05:30

ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు అకాల మృతి.. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మరీ ముఖ్యంగా మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ కావడంతో.. అన్నయ్య చివరి చూపుకు కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు అకాల మృతి.. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మరీ ముఖ్యంగా మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ కావడంతో.. అన్నయ్య చివరి చూపుకు కూడా ఆయన నోచుకోలేకపోయారు. ఇది ఆయననే కాదు.. ఆయన ఫ్యామిలీని, అభిమానులని ఎంతగానో కలచివేసింది. ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న మహేష్ బాబు.. శనివారం జరిగిన తన సోదరుడి పెద్దకర్మకి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్నయ్య చనిపోయిన రోజు రాలేకపోయానని బాధపడుతూ.. మహేష్ కన్నీటి పర్యంతం అయినట్లుగా తెలుస్తోంది. 


మొదటి నుండి అన్నయ్య రమేష్ బాబు అంటే మహేష్ బాబుకు ఎంతో ఇష్టం. ఈ విషయం ఆయన అనేక మార్లు ప్రస్తావించారు కూడా. రమేష్ బాబు చనిపోయిన రోజు మహేష్ బాబు ఎమోషనల్ అవుతూ చేసిన ట్వీట్ కూడా అన్నయ్య అంటే అతనికి ఎంత ప్రేమో తెలియజేసింది. అందులో ‘మరో జన్మంటూ ఉంటే మీరే ఎప్పటికీ నా అన్నయ్య... మిమ్మల్ని ఇప్పుడు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను..’ అంటూ మహేష్ తెలిపారు. కాగా, శనివారం రమేష్ బాబు ఇంట్లో జరిగిన ఈ పెద్దకర్మ‌కు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరైనట్లుగా సమాచారం.

Updated Date - 2022-01-22T22:27:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!