Mahesh-Allu fans: మహేష్ - అల్లు అభిమానుల అరాచకాలు

ABN , First Publish Date - 2022-11-02T17:33:27+05:30 IST

అభిమానులు ఎప్పుడూ తమ అభిమాన నటుడికి పేరు తెచ్చే విధంగా ఉండాలి. కానీ ఈమధ్య అభిమానులమని పేరు చెప్పుకుంటూ తమ అభిమాన నటులకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు అభిమానులు ప్రవర్తిస్తున్నారు.

Mahesh-Allu fans: మహేష్ - అల్లు అభిమానుల అరాచకాలు

అభిమానులు ఎప్పుడూ తమ అభిమాన నటుడికి పేరు తెచ్చే విధంగా ఉండాలి. కానీ ఈమధ్య అభిమానులమని పేరు చెప్పుకుంటూ తమ అభిమాన నటులకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు అభిమానులు ప్రవర్తిస్తున్నారు. నిజంగా వీరు తమ అభిమాన నటులకు అభిమానులేనా, లేక ఫేక్ అభిమానులా అని తెలియటం లేదు. దానికి తోడు ఈ సాంఘీక మాధ్యమాలు వచ్చాక ఇలా ఒకరి మీద ఒకరు నిందారోపణలు చెయ్యడం మరీ ఎక్కువయిపోయింది. (Mahesh and Allu fans are vying each other on social media)


అయితే కొన్ని రోజుల క్రితం సాంఘీక మాధ్యమం లో జరుగుతున్న అభిమానుల మధ్య వాదోపవాదాలు విపరీతార్ధాలకు దారితీస్తున్నాయి. కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా తమ మెదడు కి ఏది తోస్తే అది తమ ఇష్టం వఛ్చినట్టు రాసేస్తున్నారు. అలంటి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారో మరి. అసలు అభిమానులు ఇంతలా కొట్టుకుంటారు కానీ వాళ్ళందరూ మంచి స్నేహితులని ఈమధ్య ఒక సందర్భంలో ఒక నిర్మాత చెప్పనే చెప్పాడు. మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావటం లేదు. అలాగే అల్లు శిరీష్ తన అభిమాన నటుడు మహేష్ బాబు (తమ కుటుంబంలో నటుడు కాకుండా) అని చెప్పాడు కదా. మరి ఏంటి వాళ్ళ ప్రాబ్లెమ్?


అల్లు శిరీష్ (Allu Sirish) ఏదో అన్నాడని అతని స్పీచ్ లో ఒక చిన్న ముక్క కట్ చేసి దాన్ని వైరల్ చేసి, ఇంక అతని మీద లేనిపోనివన్నీ సాంఘీక మాధ్యమాల్లో పెట్టి ఎంత ఛండాలంగా ప్రవర్తిస్తున్నారో మహేష్ అభిమానులం అని చెప్పుకునే వాళ్ళు. దానికి ప్రతిగా అల్లు ఫాన్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా మహేష్ కి సంబంధించి ఏవేవో ఫోటోస్ పెట్టి ఇంకా అరాచకంగా చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోయింది అంటే, ఇద్దరు కుటుంబాలలోని ఆడవాళ్ళని కూడా ఇందులోకి లాగారు. పాపం వాళ్ళేమి చేసారు, ఎందుకు వాళ్ళ పేర్లు పెట్టడం. అసభ్య పదజాలంతో కూడిన పదాలు వాడితో ఒకరిని మించి ఒకరు మరీ దారుణంగా, ఈ సాంఘీక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. వాళ్ళు ఎందుకు ఆలా సాంఘీక మాధ్యమాలు సాక్షిగా కొట్టుకుంటున్నారో ఇక్కడ రాయడానికి అవదు, ఎందుకంటే అది అంత అసభ్యమయినది. 


పెద్ద స్టార్ లు అందరూ తమ అభిమానులకి విజ్ఞప్తి చెయ్యాలి, ఎవరూ అసభ్య పదజాలం ఉపయోగించరాదు, అలాగే తమ కుటుంబ సబ్యులని కూడా లాగొద్దు అని. ఆ ఒక్క స్టార్ గురించే మాట్లాడాలి కానీ, వాళ్ళ కుటుంబ సబ్యులని కూడా ఎందుకు ఇందులోకి లాగుతున్నారో అర్థం కావటం లేదు. ఇది మరీ తారాస్థాయికి చేరింది ఇప్పుడు. చలన చిత్ర సీమలోని పెద్దలు దీని గురించి అలోచించి పైరసీ ఎలా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ అసభ్య పదజాలంతో కూడిన అభిమానుల ఆగడాలను కూడా అరికట్టడానికి అలంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని, నిజమయిన అభిమానులు కోరుతున్నారు. 







Updated Date - 2022-11-02T17:33:27+05:30 IST