సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mahesh Babu: కృష్ణ, మహేష్ కుటుంబాలకు ఏమిటీ శాపం, అభిమానుల ఆవేదన

ABN, First Publish Date - 2022-09-28T16:15:56+05:30

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) గారి సతీమణి, మహేష్ బాబు (Mahesh Babu's mother) మాతృమూర్తి అయిన ఇందిరాదేవి (Indiradevi) బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) గారి సతీమణి,  మహేష్ బాబు (Mahesh Babu's mother) మాతృమూర్తి అయిన ఇందిరాదేవి (Indiradevi) బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కృష్ణ కుటుంబం (Krishna family) మరోసారి శోకసంద్రం లో మునిగిపోయింది. కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు (Krishna Fans) కూడా ఏమిటీ ఘోరం, ఎందుకు కృష్ణ, మహేష్ కుటుంబానికి ఇలా ఒక శాపం లా దగ్గర వాళ్ళు అందరూ దూరం అవుతున్నారు అని బాధపడుతున్నారు. 'పాపం కృష్ణ గారు' (Pampam Krishna garu) అంటూ అతన్ని చూస్తున్న అభిమానులకు కళ్ళు చమరుస్తున్నాయి. కృష్ణ గారి రెండో భార్య అయిన విజయనిర్మల (Vijayanirmala) పోయి ఇంకా ఎన్నాళ్ళు కాకుండానే, కృష్ణ గారు ఆ షాక్ నుండి తేరుకోక  ముందే, కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు (Ramesh Babu) చనిపోవటంతో అతని దుఃఖం వర్ణనాతీతం. ఈమధ్యనే కృష్ణ గారి స్నేహితుడు, సీనియర్ నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) పోయినపుడు కూడా కృష్ణ గారు చాలా ఆవేదన చెందటామె కాకుండా, పెద్దగా ఏడ్చేశారు కూడా. ఎందుకంటే కృష్ణ, కృష్ణం రాజు ఇద్దరూ అంత మంచి స్నేహితులు. ఇప్పుడు భార్య ఇందిరాదేవి దూరం అయ్యారు. కృష్ణ గారి బాధని ఎవరు పంచుకోగలరు, అతనికి దగ్గర వాళ్ళు అందరూ వెళ్లిపోయారు, అని అభిమానులు కూడా శోక సంద్రం లో మునిగిపోయారు. 


అన్న రమేష్ బాబు అంటే మహేష్ కి ప్రాణం. ఇంకా ఆ దుఃఖం నుండి తేరుకోక ముందే ఇదిగో ఇప్పుడు ఇందిరాదేవి కన్ను మూసారు. మహేష్ బాబు కి కుటుంబం లో ముగ్గురు అంటే ప్రాణం. నాయనమ్మ దుర్గమ్మ (Durgamma) గారు, అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి. దుర్గమ్మ గారు వయసుతో పాటు వృద్ధాప్యం వల్ల పోయినపుడు మహేష్ చిన్న పిల్లాడిలా బోరున విలపించిన దృశ్యాలు ఇంకా అభిమానుల గుండెల్లో కదలాడుతూనే వున్నాయి. ఈమధ్యనే  తండ్రి కన్నా ప్రాణంగా  ప్రేమించే అన్నయ్య రమేష్ బాబు దూరం అవటం, 




ఇప్పుడు తల్లి కూడా పోవటం మహేష్ ని ఒక విషాదం ముంచెత్తినది అన్నట్టుగా అయిపొయింది. ఏమైంది, ఎందుకు ఆ కుటుంబానికి ఇంత దుఃఖం అని అభిమానుల గుండెలు కూడా  కలత చెందుతున్నాయి. అందుకే సాంఘీక మాధ్యమాల్లో మహేష్ అన్నా (Mahesh Anna) నీకు మేమున్నాం అంటూ ధైర్యం చెపుతున్న ట్వీట్స్ పెడుతున్నారు. కృష్ణ గారికి ఇందిరాదేవి వలన 5 గురు సంతానం, పెద్దమ్మాయి పద్మావతి దేవి ని తెలుగు దేశం ఎం పి గళ్ళ జయదేవ్ (Jadev Galla) కి ఇచ్చారు. రెండో అమ్మాయి మంజులని (Manjula) సంజయ్ స్వరూప్ (Sanjay Swarup) కి ఇచ్చారు. మూడో అమ్మాయి ప్రియదర్శిని (Priyadarshi)ని యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) చేసుకున్నాడు. రమేష్ బాబు పెద్దబ్బాయి ఈమధ్యనే పోయాడు. ఇప్పుడు మహేష్ బాబు రెండో అబ్బాయి. మహేష్ నటి అయినా నమ్రత శిరోద్కర్ ని వివాహం చేసుకున్నాడు.  

Updated Date - 2022-09-28T16:15:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!