సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Macharla Niyojakavargam Action Dhamki : ధర్మాన్ని కాపాడే అధికారిగా నితిన్

ABN, First Publish Date - 2022-07-26T17:47:14+05:30

యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాతో యంయస్ రాజశేఖర్ రెడ్డి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి, కేథరిన్ ట్రెస్సా కథానాయికలుగా నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో నితిన్ (Nithin) తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Maharla Niyojakavargam). ఈ సినిమాతో యంయస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajasekhar Reddy) టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘ఉప్పెన’ (Uppena) బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty), కేథరిన్ ట్రెస్సా (Catherine tressa) కథానాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ (Manisharma) తనయుడు మహతి స్వరసాగర్ (Mahathi Swara Sagar) సంగీతం అందిస్తుండగా.. ‘రాజప్ప’ అనే పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా తమిళ నటుడు సముద్రఖని చేస్తున్నారు. నిజాయితీ కలిగిన ఒక ఐఏయస్ ఆఫీసర్‌కు, దుష్టరాజకీయ నాయకుడికి మధ్య జరిగే ధర్మ పోరాటంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదివరకు వచ్చిన ఈ సినిమా టీజర్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా నుంచి యాక్షన్ ధమ్కీ పేరుతో ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. అలాగే.. ట్రైలర్‌ను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్టు ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. 


‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడడం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడడానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి నేను సిద్ధం’ అనే నితిన్ మాస్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. బండి చక్రం బ్యాక్ డ్రాప్‌లో నితిన్ అగ్రెసివ్‌గా పోరుకు సిద్ధమవడం ఆకట్టుకుంటోంది. సిద్ధార్ధ రెడ్డి అనే ఐఏయస్ ఆఫీసర్ మాచర్ల గ్రామంలోని అరాచకాల్ని అడ్డుకోడానికి ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ (Shresht Moivies) బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది.  


‘చెక్, రంగ్ దే, మాస్ట్రో’ వరుసగా పరాజయం పాలవడంతో.. నితిన్ ఆశలన్నీ ‘మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి. క్లాస్ లుక్ తో నితిన్ మాసీ ఎలివేషన్ ఈ సినిమాకి హైలైట్ కానుందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలోని నితిన్ మేకోవర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. జిల్లాలోని దుష్ట రాజకీయాలతో పాలనారంగం ఎంతగా ఎఫెక్ట్ అవుతుందో ఈ సినిమాతో చెప్పబోతున్నారు. మరి ఈ సినిమా నితిన్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.   



Updated Date - 2022-07-26T17:47:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!