సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chandramukhi 2: లైకా సంస్థ ప్రకటన ‘చంద్రముఖి–2’ కోసమేనా?

ABN, First Publish Date - 2022-06-14T21:14:27+05:30

రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ చిత్రం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలై దాదాపు రెండున్నరేళ్లు థియేటర్లతో సందడి చేసింది. సినిమా వచ్చి 17 ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ చిత్రం గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటుంటారు. ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి–2’ రానుందని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రజనీకాంత్‌(Rajanikanth) హీరోగా నటించిన ‘చంద్రముఖి’ చిత్రం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలై దాదాపు రెండున్నరేళ్లు థియేటర్లతో సందడి చేసింది. సినిమా వచ్చి 17 ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ చిత్రం గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటుంటారు. ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి–2’ (Chandramukhi 2)రానుందని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం సీక్వెల్‌ గురించి ఓ వార్తలు చక్కర్లు కొడుతోంది. తాజాగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ట్విట్టర్‌లో ఓ పోస్టర్‌ విడుదల చేసి ‘బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం ఎదురుచూడండి’ అని రాసుకొచ్చారు. ఆ పోస్టర్‌ మీద ఒక తాళం చెవి బొమ్మ ఉండడంతో.. ఆ ప్రకటన ‘చంద్రముఖి –2’ గురించే అని నెటిజన్లు అభ్రిపాయపడుతున్నారు. అయితే ఆ పోస్టర్‌ వెనకున్న కథేంటో తెలుసుకోవాలంటే ఈ రోజు ఆరు గంటల వరకూ వేచి చూడాల్సిందే! 




Updated Date - 2022-06-14T21:14:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!