సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger: ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఎప్పుడు..?

ABN, First Publish Date - 2022-05-10T16:18:41+05:30

టాలీవుడ్ రౌడీ హీరోగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Devrakonda), సెన్షేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ రౌడీ హీరోగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Devrakonda), సెన్షేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) కలిసి చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్ (Liger). 'సలా క్రాస్ బ్రీడ్' అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ సినిమాను ఒకేసారి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. భారీ స్థాయిలో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇది వరుకే ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు అన్నీ విషయాలలో క్లారిటీ ఇచ్చిన పూరి, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ మేయింటైన్ చేస్తున్నారు.


సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాకు కాస్ట్ అండ్ క్రూ ముందుగానే ఫిక్సైపోతుంది. టైటిల్స్‌లో చిత్ర సంగీత దర్శకుడి పేరునూ వేస్తారు. కానీ, లైగర్ చిత్రం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మూవీకి సంగీతం అందిస్తుంది ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. టాక్ మాత్రం సాంగ్స్‌కు బాలీవుడ్ సంగీత దర్శకుడు, బ్యాక్‌గ్రౌండ్ మాత్రం మణిశర్మ అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా హంట్ థీమ్ అంటూ ఓ లిరికల్ సాంగ్‌ను వదిలారు. 


దీనికి మాత్రం విక్రమ్ మాంట్రోస్ సంగీతం అందించినట్టు టైటిల్స్‌లో పేర్కొన్నారు. అయితే, ఇతనే అన్నీ సాంగ్స్ కంపోజ్ చేస్తాడా.. లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు పూరీ టీమ్. మరి ఈ విషయంలో పక్కాగా ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. కాగా,  ఈ పాన్ ఇండియా సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్‌గా నటించింది. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) లైగర్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. పూరి కనెక్ట్స్ (Puri connects), బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions) పతాకాలపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ (Charmme Kaur), కరణ్ జోహర్ (Karan Johar), అపూర్వ మెహతా (Apoorva Mehta) సంయుక్తంగా సినిమాను నిర్మిస్తుస్తున్నారు.

Updated Date - 2022-05-10T16:18:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!