సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger: విజయ్ భారీ కటౌట్ వైరల్..

ABN, First Publish Date - 2022-07-20T18:22:53+05:30

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న మొదటి పాన్ ఇడియా చిత్రం 'లైగర్' (Liger). సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న మొదటి పాన్ ఇడియా చిత్రం 'లైగర్' (Liger). సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమాలోని విజయ్ భారీ కటౌట్ వైరల్ అవుతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) సౌత్ సినిమా ఇండస్ట్రీలకి పరిచయం అవుతోంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జొహార్‌ (Karan Johar)తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి (Charmy) నిర్మిస్తున్నారు.


లైగర్ సినిమాను ఆగస్టు 25న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ వద్ద లైగర్ మూవీలోని 75 ఫీట్ల విజయ్ భారీ కటౌట్‌ను పెట్టారు. జూలై 21 మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచింగ్ ఈవెంట్‌ను నిర్వహించతోతున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి ఈ ఈవెంట్ మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో ఇంత భారీ కటౌట్‌ను పెట్టారు.  


ఇటు దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కి అటు హీరోగా విజయ్ దేవరకొండకి మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నా కూడా ఈ మూవీ బడ్జెట్ కేవలం 120 కోట్లని చెప్పుకుంటున్నారు. ఇటీవల కాలంలో సక్సెస్ లేని విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్‌తో భారీ హిట్ అందుకున్న పూరి చేస్తున్న లైగర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇదే కాంబినేషన్‌లో జనగణమన కూడా రూపొందుతోంది.



Updated Date - 2022-07-20T18:22:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!