సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘Liger’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఆగయా..

ABN, First Publish Date - 2022-07-16T23:31:38+05:30

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (Liger)(సాలా క్రాస్‌బ్రీడ్). తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్  ‘లైగర్’ (Liger)(సాలా క్రాస్‌బ్రీడ్). తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ సరసన అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ (Charmme Kaur), కరణ్ జోహర్ (Karan Johar), అపూర్వ మెహతా(Apoorva Mehta) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ని దూకుడుగా చేస్తోంది.  ఇప్పటికే ‘లైగర్’ నుండి వచ్చిన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ పాట ఇప్పటివరకు 30 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో వుంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 21న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. (Liger Trailer Date)


ట్రైలర్ విడుదల తేదీని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో.. చుట్టూ ఫైటర్స్ వుండగా విజయ్ మధ్యలో వుండి ఫైట్‌కి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండను ఎంఎంఎ ఫైటర్‌గా ప్రజంట్ చేసి థ్రిల్లర్ రైడ్‌‌ని ప్రామిస్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండపై మాత్రమే దృష్టి పెట్టారు. మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్.. మైక్ టైసన్‌(Mike Tyson)తో సహా ఇతర నటీనటులు, సినిమా కంటెంట్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనుందని తెలుస్తోంది. అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్‌తో కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉన్న ఈ టైటిల్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటనతో.. మరోసారి సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.



Updated Date - 2022-07-16T23:31:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!