Liger OTT Release: నెల తిరక్కముందే ఓటీటీలోకి ‘లైగర్’!

ABN , First Publish Date - 2022-09-21T15:40:00+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్‌లో..

Liger OTT Release: నెల తిరక్కముందే ఓటీటీలోకి ‘లైగర్’!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘లైగర్(Liger)’. ఆగస్ట్ 25న పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించలేకపోయింది. నిజానికి ఈ చిత్రం రిలీజ్‌కి ముందే విడుదలైన.. మూవీ పోస్టర్, ట్రైలర్‌కి బీభత్సమైన రెస్సాన్స్ వచ్చింది. అలాగే.. బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటించడం మొదటి సారి ఓ ఇండియన్ సినిమాలో నటించాడు. దీంతో రిలీజ్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతుందని అందరూ భావించారు. కానీ.. అందుకు విరుద్ధంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.


ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తారని మరోసారి రుజువైంది. అలా ‘లైగర్’ కూడా నిర్మాతలకి భారీగా నష్టాలను మిగిల్చింది. దీంతో నెల తిరక్కముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, పూరీ టాకీస్ బ్యానర్‌లో పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) దక్కించుకుంది. కాగా.. ఈ నెల 22 నుంచి ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు హాట్‌స్టార్ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


అయితే.. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ నిర్మాతలు అందరూ కలిసి వారి సినిమాలను ఆరు, ఏడు వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే ‘లైగర్’ కూడా హిట్ అయినట్లైతే.. ఈ మూవీ నిర్మాతలు కూడా అలాగే చేసేవారేమో. కానీ.. భారీ పరాజయాన్ని మూట గట్టుకోవడంతో ఉన్న కాస్తా క్రేజ్ కూడా పోయేలోపు ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని టాక్. కాగా.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించగా.. రమ్యకృష్ణ ఓ ముఖ్యపాత్ర పోషించారు.

Updated Date - 2022-09-21T15:40:00+05:30 IST