సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger : ఫస్ట్ రివ్యూ ఇదే.. చిత్రం ఎలా ఉందంటే.. !

ABN, First Publish Date - 2022-08-24T17:24:38+05:30

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తొలి కలయికలో తెరకెక్కిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ (Liger). ‘సాలా క్రాస్‌బ్రీడ్’ ట్యాగ్ లైన్. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రేపే (ఆగస్ట్ 25) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తొలి కలయికలో తెరకెక్కిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ (Liger). ‘సాలా క్రాస్‌బ్రీడ్’ ట్యాగ్ లైన్. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రేపే (ఆగస్ట్ 25) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. విజయ్ బాక్సర్ గా నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటిస్తుండగా, రమ్యకృష్ణ (Ramya Krishna) కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (Mike Tyson) మరో ముఖ్యపాత్రను చేస్తున్నారు. 


‘లైగర్’ చిత్రం ప్రమోషన్స్‌ను కోసం పూరీ అండ్ టీమ్ ఓ రేంజ్‌లో కష్టపడ్డారు. విజయ్ దేవరకొండ అయితే నార్త్‌లో వరుస ఇంటర్వ్యూలు నిర్వహించి సినిమాపై అంచనాల్ని పెంచేశాడు. ‘లైగర్’ సక్సెస్‌పై విజయ్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే..  ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు (Umair Sandhu) ‘లైగర్’ ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. 


‘లైగర్’ విజిల్స్ వేయించే మాస్ ఎంటర్‌టైనర్.  విజయ్ దేవరకొండ వన్‌మేన్ షో చేశాడు. అన్నిరకాలుగానూ తన అభినయంతో మనసుదోచుకున్నాడు. కళ్ళు చెదిరే యాక్షన్ స్టంట్స్, అదిరిపోయే డైరెక్షన్.. రమ్యకృష్ణ సర్‌ప్రైజ్ ప్యాకేజ్. అయితే కథ, స్ర్కీన్ ప్లే యావరేజ్‌గా ఉన్నాయి’.. అంటూ ట్వీట్ చేశారు. దాంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తల్లీ కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలోని ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథాంశం ఉంటుందని వార్తలొచ్చాయి. మరి ఉమైర్ సంధు చెప్పినట్టుగానే ‘లైగర్’ చిత్రం ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుందని ఆశిద్దాం.  



Updated Date - 2022-08-24T17:24:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!