సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ ఫిక్స్..

ABN, First Publish Date - 2022-08-18T16:09:29+05:30

పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ‘లైగర్’ (Liger) విడుదలకు సిద్ధమైంది. గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పూరి ‘లైగర్’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ‘లైగర్’ (Liger) విడుదలకు సిద్ధమైంది. గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పూరి ‘లైగర్’ మూవీని తెరకెక్కించారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్‌గా సౌత్ ప్రేక్షకులకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. 


బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే, ఇప్పటికే..ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న పూరీ టీమ్ ఈ నెల 20వ తేదీన ‘లైగర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్‌గా జరపబోతుంది. దీనికి గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదిక కానుంది. తాజాగా లైగర్ కొత్త పోస్టర్ విడుదల చేసి ఈ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు రాబోతున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.


ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనుండగా, రమ్యకృష్ణ..మకరంద్ దేశ్‌పాండే ఇతర కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను పెంచాయి. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న లైగర్ ఈ అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. 



Updated Date - 2022-08-18T16:09:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!