సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger: సెన్సార్ కట్స్ ఇవే! నిడివి ఎంతంటే?

ABN, First Publish Date - 2022-08-19T03:03:02+05:30

మరో పాన్ ఇండియా సంచలనానికి టాలీవుడ్ సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (Liger) (సాలా క్రాస్ బ్రీడ్). ఈ చిత్రం ఆగస్ట్ 25న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో పాన్ ఇండియా సంచలనానికి టాలీవుడ్ సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (Liger) (సాలా క్రాస్ బ్రీడ్). ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ సినిమాకు ఏడు అభ్యంతరాలు వ్యక్తమవుతూ.. యు బై ఏతో సెన్సార్ సర్టిఫికేట్ జారీ అయింది. అలాగే ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 140 నిమిషాల 20 సెకన్లు నిడివితో ఈ సినిమా బాలీవుడ్ థియేటర్లలో రన్ కానుంది. 


ఈ సెన్సార్ సర్టిఫికేట్‌పై ఉన్న సమాచారం ప్రకారం.. ‘లైగర్ సాలా క్రాస్ బ్రీడ్’ అనే పూర్తి టైటిల్‌ కార్డు వేయడంతో పాటు.. సినిమా స్టార్టింగ్‌లో బ్రిటీష్ రచయిత డేవిడ్ మిచెల్లె కోట్‌ను హిందీ ట్రాన్స్‌లేషన్‌కు యాడ్ చేసినట్లుగా తెలిపారు. ఇంకా ‘ఎఫ్’తో మొదలయ్యే కొన్ని అసభ్యకర పదాలను మ్యూట్ చేయాలని, అలాగే ఫింగర్స్ చూపిస్తూ చేసే కొన్ని సైగలని తొలగించాలని.. ఈ సర్టిఫికేట్‌లో తెలిపారు. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది భారీ స్పందనను రాబట్టుకుంది. గత కొన్ని రోజులుగా నాన్‌స్టాప్‌గా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సినిమాపై టీమ్ కూడా భారీ హైప్‌ను పెంచుతోంది. ది గ్రేట్ మైక్ టైసన్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి.. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు ఈ చిత్రంలో నటించిన ఇతర తారాగణం. (Liger censor report)



Updated Date - 2022-08-19T03:03:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!