Leharaayi: పూరి, త్రివిక్రమ్ వంటివారు తీసే సినిమా!
ABN , First Publish Date - 2022-12-08T02:24:37+05:30 IST
సంచలన దర్శకులు పూరీ జగన్నాధ్ (Puri Jagannadh), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) వంటి వారు తీసినా

సంచలన దర్శకులు పూరీ జగన్నాధ్ (Puri Jagannadh), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) వంటి వారు తీసినా ‘లెహరాయి’ (Leharaayi) పెద్ద హిట్టవుతుందని అన్నారు.. చిత్ర హీరో రంజిత్ (Ranjith). బెక్కం వేణుగోపాల్ సమర్పణలో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. డిసెంబర్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ హీరో కార్తికేయ (Karthikeya) హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ఈ కార్యక్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మూవీని సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్టవ్వాలి. ఇలాంటి సినిమాలు హిట్టయితేనే.. కొత్తవాళ్లకి అవకాశాలు వస్తాయి. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుంది. చిత్రయూనిట్ మొత్తానికి అభినందనలు.. అని తెలిపారు.
హీరో రంజిత్ మాట్లాడుతూ.. నిర్మాత వేణుగోపాల్‌గారికి థాంక్యూ. ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ ఆయనే. ఈ రోజు నాకు 100 కోట్ల లాటరీ గెలిచినంత ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి కథ, ఇది పూరి జగన్నాధ్ తీసినా, త్రివిక్రమ్ తీసినా.. అందరికీ నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది. సినిమా మొదలైనప్పటి నుంచి.. మంచి పాజిటివ్ వైబ్ ఉంది. మా మూవీ ప్రొమోట్ చేయడానికి వచ్చిన కార్తికేయగారికి చాలా థాంక్యూ. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. డిసెంబర్ 9న థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ వేడుకకు హీరో అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణగారు ఇచ్చిన ఆరు పాటలు మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాకి హీరో మద్దిరెడ్డి శ్రీనివాస్ (Maddireddy Srinivas). ఆయన మాకంటే ఎక్కువగా సినిమాపై మంచి ఇంట్రస్ట్ చూపించారని అన్నారు దర్శకుడు రామకృష్ణ. నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాను నా మిత్రుడు కుమారస్వామి ప్రారంభించారు. ఇదివరకు ఆయన తీసిన సినిమాలకు నేను భాగస్వామిగా ఉన్నాను. కరోనా మహమ్మరి కారణంగా ఆయన చనిపోయాక ఈ సినిమాను పట్టుబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఈ సినిమాను కథాపరంగా, పాటల పరంగా మా టీం అంతా ఎంతో కష్టపడ్డారు. సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాకు పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను మంచి సపోర్ట్ చేశారు. డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నాం.ఈ సినిమాను చూసి ఆశీర్వదించండి.. అని కోరారు.