'భవదీయుడు భగత్ సింగ్': త్వరలోనే సర్‌ప్రైజింగ్ అప్‌డేట్..

ABN , First Publish Date - 2022-04-08T13:31:02+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలలో 'భవదీయుడు భగత్ సింగ్' కూడా ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించే ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడు.

'భవదీయుడు భగత్ సింగ్': త్వరలోనే సర్‌ప్రైజింగ్ అప్‌డేట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలలో 'భవదీయుడు భగత్ సింగ్' కూడా ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించే ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడు. గత ఏడాదే సెట్స్‌పైకి వస్తుందనుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. దాంతో మొత్తంగా ఈ ప్రాజెక్ట్‌ను పవన్ పక్కన పెట్టినట్టు ప్రచారం మొదలైంది. మధ్య మధ్యలో దర్శకుడు హరీశ్ శంకర్ ఈ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్ ఇస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం భవదీయుడు గురించి ప్రచారం జరుగుతూనే ఉంది.


తాజాగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. హీరో పవన్ కళ్యాణ్‌తో నిర్మాతలు, దర్శకుడు కలిసి ఉన్న లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి 'భవదీయుడు భగత్ సింగ్' మూవీకి సంబంధించిన అప్‌డేట్ అతి త్వరలోనే ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా విషయంలో వచ్చినవన్నీ పూర్తిగా గాలి వార్తలని తేలిపోయింది. ఇక ఆ వచ్చే అప్‌డేట్ షూటింగ్‌కు సంబంధించినదే అని అందరూ భావిస్తున్నారు. కాగా, పవన్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'హరిహర వీరమల్లు' కూడా ఈరోజు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవబోతోంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌తో పాటు టాకీ పార్ట్ కూడా పూర్తి చేయనున్నారు. దీనికి సబంధించిన లేటెస్ట్ ఫొటోస్ కూడా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొత్తానికి పవర్ స్టార్ మళ్లీ ఫుల్ జోష్‌లో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. 

Updated Date - 2022-04-08T13:31:02+05:30 IST

Read more