సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kriti Sanon: ప్రభాస్‌తో పెళ్లి?.. కృతి రియాక్షన్ ఇదే..

ABN, First Publish Date - 2022-11-30T17:17:27+05:30

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ షోలో బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) మాట్లాడుతూ.. ‘కృతి మనసులో ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రస్తుతం దీపకాతో షూటింగ్‌లో ఉన్నాడు’ అని వ్యాఖ్యానించాడు. దీంతో ఈ రూమర్స్‌ ఇంకా పెరిగాయి. మరికొని వెబ్‌సైట్స్‌లో అయితే త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని రాసుకొచ్చాయి. దీనిపై తాజాగా కృతి సనన్ సోషల్ మీడియాలో వేదిక స్పందించింది.


కృతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీలో.. ‘‘ఇది ప్యార్ లేదా పీఆర్ కాదు. మా ‘భేడియా’ (Bhediya) నటుడు ఒక రియాలిటీ షోలో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించాడు. అతను సరదా మాట్లాడిన మాటలు పట్టుకుని రకరకాలు పుకార్లు పుట్టుకొచ్చాయి. కొన్ని పోర్టల్స్ నా పెళ్లి తేదీని ప్రకటించే ముందు.. ఈ రూమర్స్‌పై నన్ను క్లారిటీ ఇవ్వనివ్వండి. ఆ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి!’ అని రాసుకొచ్చింది.


కాగా.. ప్రభాస్, కృతి కలిసి రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’లో నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2023న విడుదల చేయాలని మూవీ టీం భావించింది. పలు కారణల వల్ల జూన్ 16, 2023కి విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్, లంకేష్‌గా సైఫ్‌ అలీఖాన్ నటిస్తున్నారు.



Updated Date - 2022-11-30T17:17:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!