సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Krithi Shetty: అన్నదమ్ములు ఇద్దరితో..

ABN, First Publish Date - 2022-09-19T21:26:24+05:30

ఉప్పెన (Uppena) అనే సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించిన కృతి శెట్టి (Krithi Shetty) ఇప్పుడు వరస ప్లాప్ లను చవి చూస్తోంది. ఈమధ్య విడుదల అయినా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) అన్న సినిమా కూడా ప్లాప్ అవటం వరసగా మూడో సారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పెన (Uppena) అనే సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించిన కృతి శెట్టి (Krithi Shetty) ఇప్పుడు వరస ప్లాప్ లను చవి చూస్తోంది. ఈమధ్య విడుదల అయినా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) అన్న సినిమా కూడా ప్లాప్ అవటం వరసగా మూడో సారి. అయినా కూడా కృతి శెట్టి ఏమాత్రం తగ్గటం లేదు. పెద్ద సినిమాలే చేతిలో వున్నాయి. నాగ చైతన్య (Naga Chaitanya) తో ఒక సినిమా చేస్తోంది ఇప్పుడు, అది షూటింగ్ కూడా మొదలయ్యింది. అలాగే  సూర్య (Suriya) తో ఒక సినిమా అగ్రిమెంట్ చేసుకుంది, అది షూటింగ్ కూడా కొంచెం అయి ఇప్పుడు ఆగిందని, మళ్ళీ అది మొదలవుతుందని తెలిసింది. అలాగే సూర్య తమ్ముడు కార్తీ (Kaarthi) తో కూడా కృతి శెట్టి (Krithi Shetty) ఒక సినిమా చేయనుంది అని తెలుస్తోంది. కార్తీ  (Kaarthi) తో సినిమాకి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని, అది కన్ఫర్మ్ (Confirm) అయిపోతుందని అంటున్నారు. ఈ సినిమా కూడా కన్ఫర్మ్ అయితే కృతి శెట్టి ఇద్దరు అన్నదమ్ములతో చేస్తున్న నటిగా పేరు చేరుతుంది. ఇంతకు ముందు కాజల్ (Kajal Agarwal), త్రిష (Trisha), తమన్నా (Tamannah Bhatia), ఇంకా మరికొంతమంది  నటీమణులు ఈ ఇద్దరు అన్నదమ్ములతో చేసినవారే. ఇప్పుడు కృతి శెట్టి కూడా ఆ కోవలోకే వస్తుంది ఈ రెండు సినిమాలతో. 

Updated Date - 2022-09-19T21:26:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!