Krishna Vamshy : ‘అన్నం’ పరబ్రహ్మ సర్వరూపం

ABN , First Publish Date - 2022-07-08T19:30:47+05:30 IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishnavamshy) ఆఖరుగా సందీప్ కిషన్ (Sandeep Kishan), సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) హీరోలుగా ‘నక్షత్రం’ (Nakshtram) సినిమా తెరకెక్కించారు. అది పరాజయం పాలవడంతో ఐదేళ్ళపాటు కృష్ణవంశీ ఎలాంటి సినిమా చేయకుండా.. ఒకే ఒక సినిమాపై తన దృష్టినంతటినీ కేంద్రీకరించారు.

Krishna Vamshy : ‘అన్నం’ పరబ్రహ్మ సర్వరూపం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishnavamshy) ఆఖరుగా సందీప్ కిషన్ (Sandeep Kishan), సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) హీరోలుగా ‘నక్షత్రం’ (Nakshtram)  సినిమా తెరకెక్కించారు. అది పరాజయం పాలవడంతో ఐదేళ్ళపాటు కృష్ణవంశీ ఎలాంటి సినిమా చేయకుండా.. ఒకే ఒక సినిమాపై తన దృష్టినంతటినీ కేంద్రీకరించారు. ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్రధాన పాత్రలో ‘రంగమార్తాండ’ (Rangamarthanda) అనే సోషల్ డ్రామా ప్రస్తుతం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటోంది. మరాఠీ సూపర్ హిట్ ‘నటసమ్రాట్’ (Natasamrat) చిత్రానికిది అఫీషియల్ రీమేక్. నానా పటేకర్ (Nanapatekar) ప్రధాన పాత్రలో నటించారు. నాటకరంగంలో విశేషమైన ఖ్యాతిని గడించిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అనూహ్యసంఘటనల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కతోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదల కాబోతున్నట్టు సమాచారం. మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాకి జీవం పోయనున్నాయి.


ఇదిలా ఉంటే.. ‘రంగమార్తండ’ చిత్రం సెట్స్‌పై ఉండగానే.. అప్పట్లో కృష్ణవంశీ ‘అన్నం’ (Annam) అనే తదుపరి సినిమా పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సినిమాపై మరో అప్డేట్ రాలేదు. పెద్ద అరిటాకులో అన్నం మెతుకులతో ఫామ్ అయిన ‘అన్నం’ అనే టైటిల్ ఆకట్టుకుంది. విస్తరి మధ్యలో ఒక వేటకత్తి, చుట్టూ రక్తం, ఆ పక్కన తెగిన తాళిబొట్టు ఉన్న ఆ కాన్సెప్ట్  పోస్టర్ అప్పట్లో వైరల్ అయింది. ‘రంగమార్తాండ’ ఎలాగూ ఈ ఏడాది విడుదలయిపోతుంది. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా ‘అన్నం’ అని టాక్స్ వినిపిస్తున్నాయి. ‘సిందూరం’ (Sindooram) తరహాలో ఓ సామాజిక సమస్యని కథావస్తువుగా తీసుకొని ఆయన ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. రైతన్నలు, హత్యలు, ఆత్మహత్యలు, పుస్తెలు తాకట్టుపెట్టి పస్తులుండే పరిస్థితిని కళ్ళకు కట్టబోతున్నట్టు తెలుస్తోంది. 


‘అన్నం’ చిత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ‘రంగమార్తాండ’ చిత్రం విడుదలైన తర్వాత రాబోతోందని వినికిడి. ‘పరబ్రహ్మ స్వరూపం’ (Parabrahma Swaroopam) అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రూపొందనుంది. నిర్మాత ఎవరు? నాయికానాయకులు, ఇతర కేస్టింగ్, టెక్నీషియన్స్ తదితర వివరాలు అప్పుడే తెలుస్తాయి. నిజానికి కృష్ణవంశీ ఓ సినియర్ హీరో 100వ చిత్రంగా అప్పట్లో ‘రైతు’ (Raithu) అనే సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడీ సినిమా అదే కథాంశంతో టైటిల్ మార్పుతో రాబోతున్నట్టు అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-07-08T19:30:47+05:30 IST