సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Super Star Krishna : మల్టీస్టారర్స్‌లోనూ రికార్డే!

ABN, First Publish Date - 2022-11-15T21:36:46+05:30

అయిదున్నర దశాబ్ధాల సినీ చరిత్ర ఆ పుస్తకంలో 350కు పైగా పేజీలు కొన్ని పేజీల్లో క్రైమ్‌, నవలా చిత్రాలుంటే మరికొన్ని పేజీల్లో చారిత్రకం, పౌరాణికం, జానపదాలు, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, మల్టీస్టారర్‌, రీమేక్‌ చిత్రాలు, రాజకీయ చిత్రాలు, సాంఘికం ఇలా రకరకాల జానర్లు, భిన్నమైన ప్రయోగాలతో ఏ పేజీకి అదే ప్రత్యేకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయిదున్నర దశాబ్ధాల సినీ చరిత్ర (Super Star Krishna)

ఆ పుస్తకంలో 350కు పైగా పేజీలు (multi starrer movies)

కొన్ని పేజీల్లో క్రైమ్‌, నవలా చిత్రాలుంటే 

మరికొన్ని పేజీల్లో చారిత్రకం, పౌరాణికం, జానపదాలు, 

ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, మల్టీస్టారర్‌, రీమేక్‌ చిత్రాలు, రాజకీయ చిత్రాలు, సాంఘికం (NTR, ANR. Shobanbabu, krishna, krishnam raju)

ఇలా రకరకాల జానర్లు, భిన్నమైన ప్రయోగాలతో ఏ పేజీకి అదే ప్రత్యేకం. ఇదీ సూపర్‌స్టార్‌ కృష్ణ (Krishna)సినీ చరిత్ర. ఆయన చేసిన ఎన్నో ప్రయోగాల్లో మల్టీస్టారర్‌ ఒకటి. బాక్సాఫీస్‌ వద్ద పోటాపోటీగా సాగే ఇద్దరు హీరోలు, అందులోనూ స్టార్స్‌ కలిసి నటించిన చిత్రాలకు క్రేజ్‌ వేరుగా ఉంటుంది. హీరోగా తాను గొప్ప స్థాయిలో ఉన్నా మరో హీరోతో కలిసి నటించడానికి కృష్ణ ఎప్పుడూ వెనకాడలేదు కృష్ణ. ‘ఫలానావారితో నేను నటించను’ వంటి మాటలు ఆయన డిక్షనరీలో లేదు. తనకంటే సీనియర్స్‌తోనూ, సమకాలీకులతోనూ వారి తనయులతోనూ మల్టీస్టారర్‌ చిత్రాలు చేశారు కృష్ణ. ఇన్ని తరాల స్టార్‌లతో కలిసి నటించిన ఘనత బహుశా కృష్ణకే దక్కినట్లుంది. తన కెరీర్‌లో 32కు పైగా మల్టీస్టారర్‌ చిత్రాలు చేశారు కృష్ణ. సినీ ప్రయాణంలో ఆయన చేసినన్ని మల్టీస్టారర్‌ చిత్రాలు మరే నటుడు చేయలేదని చెప్పొచ్చు. కృష్ణ నటించిన మల్టీస్టారర్‌ చిత్రాలపై ఓ లుక్కేద్దాం...


కృష్ణ స్టార్‌గా ఎదిగిన తర్వాత మరో హీరోతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న తొలి చిత్రం ‘ఇద్దరు మొనగాళ్లు’. అందులో కాంతారావుతో(Kantharao) కలిసి ఆయన నటించారు. ఆ తర్వాత ఈ కాంబోలో మరో రెండు చిత్రాలొచ్చాయి. ‘పాతాళభైరవి’ సినిమాలోని ఎన్టీఆర్‌ నటనకు ముగ్దుడైన కృష్ణ.. ఆయనతోనే కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయంగా చెబుతుండేవారు. ఎన్టీఆర్‌తో (NTR) కలిసి కృష్ణ నటించిన తొలి సినిమా ‘స్ర్తీ జన్మ’. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నిలువు దోపిడి’, ‘విచిత్ర కుటుంబం’, ‘దేవుడు చేసిన మనుషులు, ‘వయ్యారి భామలు–వగలమారి భర్తలు సినిమాలొచ్చాయి. ఈ ఐదు చిత్రాల్లోనూ ఎన్టీఆర్‌ – కృష్ణ సోదరులుగా నటించారు. కాలేజీ రోజుల్లో ఏయన్నార్‌ను చూసి ఆయనకులా ‘ఎప్పటికేౖనా హీరో కావాలి’ కలలు కని చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు కృష్ణ. అక్కినేని స్ఫూర్తితోనే ఆయన హీరోగా నిలబడ్డారు. అక్కినేనితో కలిసి ‘మంచి కుటుంబం’, ‘అక్కాచెల్లెళ్లు’, ‘హేమాహేమీలు’, ‘గురుశిష్యులు’, ‘ఊరంతా సంక్రాంతి’, ‘రాజకీయ చదరంగం’ సినిమాల్లో నటించారు. అలాగే కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన నటుడు కృష్ణంరాజు. శోభన్‌బాబు,  మోహన్‌బాబు, కాంతారావుతో 3, శివాజీ గణేశన్‌తో 3, రజనీకాంత్‌తో 3, సుమన్‌తో 3, నాగార్జునతో 2, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్‌, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమా చేశారు. తన కొడుకులు రమేశ్‌బాబుతో 5, మహేశ్‌బాబుతో 7 చిత్రాల్లో కృష్ణ నటించారు. 






Updated Date - 2022-11-15T21:36:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!