సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొత్త కొత్తగా.. ‘డైమండ్‌ రాణి’

ABN, First Publish Date - 2022-01-21T22:31:40+05:30

అజయ్‌, వీర్తి వఘాని జంటగా నటిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. మురళీధర్‌రెడ్డి ముక్కర నిర్మిసున్న ఈ సినిమాకు హనుమాన్‌ వాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘డైమండ్‌ రాణి’ అంటూ సాగే పాటను దర్శకుడు మారుతి శుక్రవారం విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజయ్‌, వీర్తి వఘాని జంటగా నటిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. మురళీధర్‌రెడ్డి ముక్కర నిర్మిసున్న ఈ  సినిమాకు హనుమాన్‌ వాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘డైమండ్‌ రాణి’ అంటూ సాగే పాటను దర్శకుడు మారుతి శుక్రవారం విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. చక్కని ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేయగా చక్కని స్పందన అందుకొంది. సినిమా షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. సీనియర్‌ నటుడు ఆనంద్‌, కాశీ విశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 


Updated Date - 2022-01-21T22:31:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!