Ranga Ranga Vaibhavanga: మెలోడియస్‌గా 'కొత్తగా లేదేంటి' లిరికల్ వీడియో సాంగ్..
ABN , First Publish Date - 2022-05-06T19:13:03+05:30 IST
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూడవ సినిమా 'రంగ రంగ వైభవంగా'. తాజాగా ఈ సినిమా నుంచి 'కొత్తగా లేదేంటీ' అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది.

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూడవ సినిమా 'రంగ రంగ వైభవంగా'. తాజాగా ఈ సినిమా నుంచి 'కొత్తగా లేదేంటీ' అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' సినిమాతో హీరోగా మారిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్ళు రాబట్టి డెబ్యూ హీరోగా కొత్త రికార్డ్స్ సెట్ చేశాడు. దాదాపు పాతికేళ్ళ నుంచి ఉన్న డెబ్యూ హీరో రికార్డ్స్‌ను బ్రేక్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటించిన రెండవ సినిమా 'కొండపొలం'.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన కమర్షియల్ సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు చేస్తున్న మూడవ సినిమాతో భారీ హిట్ కొట్టాలనే తాపత్రయంతో ఉన్నాడు వైష్ణవ్ తేజ్. ఇప్పుడు చేస్తున్న 'రంగ రంగ వైభవంగా' రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ మెడికల్ స్టూడెంట్స్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది.
త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్న మేకర్స్, ఒకవైపు నుంచి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'తెలుసా తెలుసా' అనే పాట విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు 'కొత్తగా లేదేంటీ' అంటూ సాగే బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ విడుదల చేయగా.. అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్‌లో వైష్ణవ్ తేజ్, కేతిక రొమాంటిక్ లుక్స్‌లో ఆకట్టుకుంటున్నారు. కాగా, 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గిరీశయ్య 'రంగ రంగ వైభవంగా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇక తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ ‘కొత్తగా లేదేంటీ’ ఎలా నడిచిందంటే..

"కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి"
- అది ఆ అబ్బాయి సందేహం.
"ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి
ఎంతదూరమైన నువ్వు నేను
ఒకటే కాబట్టి..."
-ఇదీ ఈ అమ్మాయి సమాధానం.
"గుండె సడి తోటి
ముద్దు సడి పోటి
హద్దు దాటిందే ఐనా
కొత్తగా లేదేంటి " - అంటాడతను.
"సెకనుకో కోటి
కలలు కనలేదేంటి
దానితో పోల్చి చూస్తే
ఇందులో గొప్పేంటి..." అని తేల్చిపడేస్తుంది ఈమె.
అనుభవం ఇద్దరిదీ అయినా, ఆ అబ్బాయిది అనుమానం... ఈ అమ్మాయిది అనుభూతి.
అందుకే-
"ఎంత ఏకాంతమో
మన సొంతమే అయిన
కొత్తగా లేదేంటి..." అని ఆశ్చర్యపోతాడు అబ్బాయి.
"ఎంత పెద్ద లోకమో
మన మధ్యలో
అయిన ఎప్పుడడ్డుగుందేంటి..." అని తలెగరేస్తుంది అమ్మాయి.
"ఎన్నినాళ్ల వీక్షణం ఈ క్షణం
కొత్తగా లేదేంటి" అంటున్న అతనితో ధీమాగా చెబుతుంది:
"ఎందుకంటె ఏ క్షణం
విడిపో మనం అని నమ్మకం కాబట్టి" అని.
సున్నితమైన పాటలు రాసే శ్రీమణి ‘రంగరంగ వైభవంగా’ కోసం రాసిన మరో మెత్తని యుగళగీతమిది.
* *
చిత్రం: రంగ రంగ వైభవంగా
గీత రచయిత : శ్రీమణి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి
ఎంతదూరమైన నువ్వు నేను
ఒకటే కాబట్టి
మనిషినెక్కడో ఉన్నా
మనసు నీ దగ్గరే
నిదురలో నేనున్నా
కలలు నీ వద్దకే
ఒకరికొకరై కలిసిలేమా
ఇద్దరం ఒకరై ... ఒకరై
- కొత్తగా లేదేంటి-
గుండె సడి తోటి
ముద్దు సడి పోటి
హద్దు దాటిందే ఐనా
కొత్తగా లేదేంటి
సెకనుకో కోటి
కలలు కనలేదేంటి
దానితో పోల్చి చూస్తే
ఇందులో గొప్పేంటి
ఎంత ఏకాంతమో
మన సొంతమే అయిన
కొత్తగా లేదేంటి
ఎంత పెద్ద లోకమో
మన మధ్యలో
అయిన ఎప్పుడడ్డుగుందేంటి
- కొత్తగా లేదేంటి-
కొత్తగుంటుంది ప్రేమ అంటారే
పక్కనుంది ప్రేమే అయినా
కొత్తగా లేదేంటి
మొదటి అడుగేసె
ఆపవా నువ్వూ
ఇంత నడిచాక ఆ నడకలో
తడబాటుంటాదేంటి
ఎన్నినాళ్ల వీక్షణం ఈ క్షణం
కొత్తగా లేదేంటి
ఎందుకంటె ఏ క్షణం
విడిపో మనం అని నమ్మకం కాబట్టి
- కొత్తగా లేదేంటి -