30 ఇయర్స్ పృథ్వీ పర్యవేక్షణలో ‘కొత్త రంగుల ప్రపంచం’

ABN , First Publish Date - 2022-04-04T04:13:06+05:30 IST

సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పర్యవేక్షణలో శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. పృథ్వీరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్ తదితరులు

30 ఇయర్స్ పృథ్వీ పర్యవేక్షణలో ‘కొత్త రంగుల ప్రపంచం’

సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పర్యవేక్షణలో శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. పృథ్వీరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రస్తుతం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ లుక్‌ని మీడియా సమక్షంలో రివీల్ చేశారు. ఈ సందర్భంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడుతూ.. నేను ఎక్కువగా విలన్స్‌తోనే ట్రావెల్ అయ్యాను. వారి ద్వారా నటనలో ఎంతో నేర్చుకున్నాను. ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమాతో హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న వారిని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుతున్నాను. కొత్త వారైనా చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు. ఇద్దరూ చాలా బాగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చిత్ర టైటిల్‌ను రివీల్ చేస్తున్నాము. ఇలాంటి మంచి సినిమాలో నేను దర్శకుడి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత అతనికి చాలా మంచి పేరు, అవకాశాలు వస్తాయి. ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.. అన్నారు. 


సీనియర్ నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిర్మాతలకు నష్టం రాకుండా చక్కటి సినిమా తీయాలని పృథ్వీ గారు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఈ చిత్ర నిర్మాతలు మంచి కాన్సెప్ట్ ఉన్న సెంటిమెంట్ కథను సెలెక్ట్ చేసుకొని ఓ మంచి సినిమా తీయాలని కంకణం కట్టుకున్నారు. వారికి ఈ సినిమా గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. హీరో క్రాంతి కృష్ణ, హీరోయిన్ శ్రీలు.. ఈ చిత్రంతో పరిచయం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. చిత్రం మంచి విజయం సాధించాలని కోరారు.

Updated Date - 2022-04-04T04:13:06+05:30 IST