సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పవర్ స్టార్‪కి కథ సిద్ధంగా ఉంది: కొరటాల శివ

ABN, First Publish Date - 2022-04-28T03:30:34+05:30

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‪కు కథ సిద్ధంగా ఉందని అన్నారు సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్‪గా విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‪కు కథ సిద్ధంగా ఉందని అన్నారు సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్‪గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ చిత్ర విశేషాలతో పాటు, తదుపరి ఆయన చేయబోయే చిత్రాల వివరాలను కూడా కొరటాల తెలియజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటి నుండి నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టేది కథపైనే. కథ బాగుంటే.. ప్రేక్షకుల నుండి సినిమాపై వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. ‘ఆచార్య’కు మంచి కథ కుదిరింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎలా అయితే ఎక్జయిటింగ్‪గా ఎదురుచూస్తున్నారో.. నేను కూడా అలానే వేచి చూస్తున్నాను. ఇక నా తదుపరి చిత్రం తారక్‪తో ఉంటుంది. పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అది నిజం కాదు. నా కెరియర్‪లో ఇప్పటి వరకు రాయని పరిధిలో తారక్‪తో చేసే సినిమా కథ ఉంటుంది. చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమా కాకుండా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‪గారి కోసం ఓ కథ సిద్ధంగా ఉంది. అది ఆయన కోసమే రాసి పెట్టుకున్నాను. ఇంకా ప్రభాస్‪తో కూడా ఓ సినిమా ఉంటుంది. అలాగే రామ్ చరణ్‪తో మళ్లీ సినిమా ఎప్పుడైనా ఉండొచ్చు..’’ అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-04-28T03:30:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!