కొరమీను బాగుందని ప్రచారం చేస్తారు

ABN , First Publish Date - 2022-12-29T01:27:30+05:30 IST

ఆనంద్‌ రవి కథా నాయకుడిగా శ్రీ పతి కర్రి దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీస్‌ ఆఫ్‌ ఇగోస్‌’ అనేది క్యాప్షన్‌. పెళ్లకూరు సమన్యరెడ్డి నిర్మాత...

కొరమీను బాగుందని ప్రచారం చేస్తారు

ఆనంద్‌ రవి కథా నాయకుడిగా శ్రీ పతి కర్రి దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీస్‌ ఆఫ్‌ ఇగోస్‌’ అనేది క్యాప్షన్‌. పెళ్లకూరు సమన్యరెడ్డి నిర్మాత. డిసెంబరు 31న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సమన్యరెడ్డి మాట్లాడుతూ ‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో ఆసక్తికర అంశంతో కథ సాగుతుంది’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక డైరెక్టర్‌లా కాకుండా... ఒక ప్రేక్షకుడిలా చెబుతున్నా... ‘కొరమీను’ ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా ఉంటుంది. డ్రైవర్‌, ధనవంతుడైన యజమాని, శక్తిమంతుడైన పోలీస్‌ అధికారి పాత్రలు మధ్య నడిచే కఽథ ఇది. సినిమా చూశాక ప్రేక్షకులు మరో నలుగురికి బాగుంది అని చెబుతారనే నమ్మకం ఉంద’న్నారు. ‘కొరమీను’ చూసిన ఏ ఒక్కరూ నిరాశ చెందరు అని ఆనంద్‌ రవి అన్నారు.

Updated Date - 2022-12-29T01:27:30+05:30 IST

Read more