Korameenu: టేస్ట్ అదిరిపోయేలా ఉందిగా..

ABN , First Publish Date - 2022-10-30T09:43:55+05:30 IST

ఆనంద్‌ రవి, హరీశ్‌ ఉత్తమన్‌, శత్రు, కిశోర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘కొరమీను’. శ్రీపతి కర్రి దర్శకుడు...

Korameenu: టేస్ట్ అదిరిపోయేలా ఉందిగా..

ఆనంద్‌ రవి, హరీశ్‌ ఉత్తమన్‌, శత్రు, కిశోర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘కొరమీను’ (korameenu). శ్రీపతి కర్రి దర్శకుడు. పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మాత. మోషన్‌ పోస్టర్‌ని ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘జాలారి పేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ డ్రైవర్‌, తన యజమాని, విశాఖలో శక్తిమంతమైన పోలీస్‌ అధికారి.. ఈ ముగ్గురి మధ్య జరిగే ‘కొరమీను’ ఆసక్తికరంగా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తామ’’న్నారు.


ఈ మోషన్ పోస్టర్‌ ఎలా ఉందంటే.. ఆకాశంలో విపరీతమైన మబ్బులతో మేఘామృతంమై ఉరుములు మెరుపుల మధ్య జాలర్లు పట్టే కొన్ని వందల బొట్స్ కనిపించగా.. అందులోని ఒక బోట్‌పై ‘మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?’ అంటూ.. అక్కడే ఒక యువకుడు సీరియస్‌గా ఎంతో తీక్షణమైన లుక్‌తో చూస్తున్నట్లుగా చూపించారు. ఈ మోషన్ పోస్టర్‌లోని BGM, సెట్టింగ్స్ సినిమాపై క్యూరియాసిటీని కలిగించేలా ఉన్నాయి. ఇగోకి సంబంధించిన కథతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని ఈ పోస్టర్‌తోనే మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రానికి అనంత నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. (korameenu First Look Motion Poster)




Updated Date - 2022-10-30T09:43:55+05:30 IST