Aishwarya Rajesh: ‘డ్రైవర్’గా మారిన హీరోయిన్.. కొందరు వ్యక్తులు క్యాబ్ ఎక్కిన తర్వాత ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-11-02T16:10:07+05:30 IST

టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న కోలీవుడ్ (Kollywood) నటి ‘ఐశ్వర్య రాజేష్’ (Aishwarya Rajesh). కేవలం ప్రాధాన్యం ఉన్న పాత్రలనే దూసుకుపోతోంది...

Aishwarya Rajesh: ‘డ్రైవర్’గా మారిన హీరోయిన్.. కొందరు వ్యక్తులు క్యాబ్ ఎక్కిన తర్వాత ఏమైందంటే..

టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న కోలీవుడ్ (Kollywood) నటి ‘ఐశ్వర్య రాజేష్’ (Aishwarya Rajesh). కేవలం ప్రాధాన్యం ఉన్న పాత్రలనే దూసుకుపోతోంది. అందులోనూ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథలతో సాగుతూ దూసుకుపోతోంది. ఇంతకు ముందే ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ మరో లేడీ ఓరియెంటెడ్ కథతో ముందుకు రానుంది. ఆ సినిమానే ‘డ్రైవర్ జమున’ (Driver Jamuna). అందులో లేడీ డ్రైవర్‌గా ఐశ్వర్య నటిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఈ భామ మాట్లాడింది. తన సినీ కెరీర్‌లో మంచి చిత్రాల్లో నటించాలన్నదే తన ధ్యేయమని హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ పేర్కొంది.


ఐశ్వర్య మాట్లాడుతూ, ‘‘కనా’ తర్వాత నేను నటించిన చిత్రం థియేటర్‌లో విడుదలవుతుంది. ఫిమేల్‌ సెంట్రిక్‌ సినిమాలు చేయాలన్న మైండ్‌ సెట్‌ లేదు. ఈ స్టోరీ విన్న తర్వాత ఒకే రోజు నిర్ణయం తీసుకున్నా. ఇది నాకు, దర్శకుడికి మంచి చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. చిన్న చిత్రమైన మంచి సినిమాకు మీడియాతో పాటు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. జిబ్రాన్‌ సంగీతం మూవీకి హైలెట్‌. రిస్కీ సీన్‌ మినహా మిగిలిన మిగిలిన అన్ని సీన్లనో నటించాను. ఒక్క తమిళంలోనే కాదు అన్ని భాషల్లో నటించాలన్నదే నా కోరిక’ అని ఆశాభావం వ్యక్తం చేసింది.


ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటించిన ‘డ్రైవర్‌ జమున’  ఈ నెల 11న విడుదలకానుంది. లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్టుతో తెరకెక్కగా, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కొందరు క్రిమినల్స్‌ను తన క్యాబ్‌లో తీసుకెళ్లే మార్గంలో 90 నిమిషాల పాటు సాగే రైడ్‌లో ఎలాంటి ట్విస్టులు, మలుపులున్నాయన్నదే ఈ చిత్ర కథ. ఔట్‌ అండ్‌ ఔట్‌ రోడ్‌ మూవీగా దర్శకుడు పి.కిన్‌స్లిన్‌ రూపొందించారు. 18 రీల్స్‌ బ్యానరుపై ఎస్‌.పి.చౌదరి నిర్మించారు. తమిళంతో పాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు.





Updated Date - 2022-11-02T16:10:07+05:30 IST