Nenevaru: టీజరే కాదు.. ట్రైలర్‌కూ అదే స్పందన

ABN , First Publish Date - 2022-11-25T19:45:15+05:30 IST

దివంగత ఎడిటర్ కోలా భాస్కర్ (Kola Bhaskar) తనయుడు కోలా బాలకృష్ణ (Kola BalaKrishna) హీరోగా, సాక్షి చౌదరి (Sakshi Chowdary) హీరోయిన్‌గా.. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై

Nenevaru: టీజరే కాదు.. ట్రైలర్‌కూ అదే స్పందన

దివంగత ఎడిటర్ కోలా భాస్కర్ (Kola Bhaskar) తనయుడు కోలా బాలకృష్ణ (Kola BalaKrishna) హీరోగా, సాక్షి చౌదరి (Sakshi Chowdary) హీరోయిన్‌గా.. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేనెవరు’ (Nenevaru). నిర్ణయ్ పల్నాటి (Nirnay Palnati) దర్శకత్వంలో లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి (RG Sarathee) ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.


చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్‌.. మంచి స్పందనను రాబట్టుకోగా..  తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ కూడా విడుదలైన కొన్ని నిమిషాలలోనే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందనకు చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లవ్ - సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలపగా.. హీరో కోలా బాలకృష్ణ, దర్శకుడు నిర్ణయ్, సంగీత దర్శకుడు ఆర్.జి.సారథిలకు చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు భీమినేని శివప్రసాద్ - తన్నీరు రాంబాబు పేర్కొన్నారు. ఎడిటర్‌గా కోలా భాస్కర్ చివరి చిత్రం ఇదే కావడం విశేషం. (Nenevaru Movie Trailer Out)



Updated Date - 2022-11-25T19:45:15+05:30 IST