రగ్డ్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న ‘Vikram Goud’
ABN , First Publish Date - 2022-07-06T22:23:55+05:30 IST
కన్నడ హీరో కిరణ్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్ గౌడ్’. కన్నడలో ఇటీవల విడుదలైన ‘బడ్డీస్’ చిత్రంతో కిరణ్ రాజ్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’గా తెలుగు ప్రేక్షకులను..
కన్నడ హీరో కిరణ్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్ గౌడ్’. కన్నడలో ఇటీవల విడుదలైన ‘బడ్డీస్’ చిత్రంతో కిరణ్ రాజ్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’గా తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించేందుకు కిరణ్ రాజ్ రెడీ అవుతున్నారు. కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రం పాశం నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కిరణ్ రాజ్ సరసన దీపికా సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోంది. హీరో కిరణ్ రాజ్ పుట్టినరోజుని పురస్కరించుకుని.. జూలై 5న చిత్రయూనిట్ ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్లో కిరణ్ రాజ్ పూర్తిగా రగ్డ్ లుక్‌లో కనిపించారు. చేతిలో సిగరెట్‌తో.. ఊర మాస్ లుక్‌లో ఉన్న ఆయన అవతారం ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రానికి లొట్టిపలి రామకృష్ణ సహ నిర్మాతగా.. పామరాజు జానకి రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్ర ఆనంద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నామని చిత్రయూనిట్ పేర్కొంది.