పవన్ బ్లాక్ బస్టర్ మూవీతో 'గని' చిత్రాన్ని పోల్చిన దర్శకుడు..

ABN , First Publish Date - 2022-04-03T21:54:06+05:30 IST

కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన తాజా చిత్రం 'గని'. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా నటించారు. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న

పవన్ బ్లాక్ బస్టర్ మూవీతో 'గని' చిత్రాన్ని పోల్చిన దర్శకుడు..

కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన తాజా చిత్రం 'గని'. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా నటించారు. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే వైజాగ్‌లో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ.. ' ముందుగా వైజాగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడే తొలిప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా కథ ఓకే అయ్యింది. షూటింగ్ కూడా ఇక్కడే మొదలైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అవంతి శ్రీనివాస్ గారికి, హరీష్ శంకర్ గారికి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి థాంక్యూ. ఈ సినిమా నాకు మూడేళ్ల కల. నా మీద నమ్మకంతో వరుణ్ తేజ్ గారు ఇంత పెద్ద ప్రాజెక్టు నాకు అప్పగించారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో 'తమ్ముడు' సినిమా ఎలాంటి మైల్ స్టోన్ గా నిలిచిందో.. వరుణ్ తేజ్ గారికి 'గని' సినిమా అలా మైల్ స్టోన్ అవుతుంది. ఇక మా నిర్మాతలు ఇద్దరు సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. 


అల్లు బాబి, సిద్దు గారికి దానికి థాంక్యూ. ప్రతి నిమిషం నాతో పాటు వాళ్ళు కూడా మూడు సంవత్సరాలు కృషి చేశారు. మధ్యలో కరోనా వచ్చిన కూడా వెనకడుగు వేయలేదు. అన్ని విషయాలు మాకు ముందుండి మా గురువు అల్లు అరవింద్ గారు చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ నన్ను, బాబి, సిద్ధుని ముందుకు నడిపించారు. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినిమా తీస్తే రికార్డులో ఉంటుంది. హిట్టయితే చరిత్రలో ఉంటుంది. ఖచ్చితంగా 'గని' సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఏప్రిల్ 8న థియేటర్లలో మీరే అది చూస్తారు' అని తెలిపారు.

Updated Date - 2022-04-03T21:54:06+05:30 IST

Read more