సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The Ghost ట్విట్టర్ రివ్యూ: నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే?

ABN, First Publish Date - 2022-10-05T16:49:44+05:30

కింగ్ నాగార్జున (King Nagarjuna) హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). బరిలో మెగాస్టార్ చిరంజీవి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కింగ్ నాగార్జున (King Nagarjuna) హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). బరిలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ (God Father) చిత్రమున్నా.. ‘శివ’ (Siva) సెంటిమెంట్.. అలాగే దసరా పండుగను పురస్కరించుకుని నేడు (అక్టోబర్ 05) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన నెటిజన్లు కొందరు ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ట్విట్టర్ టాక్‌ని ఒక్కసారి గమనిస్తే.. ఈ సినిమాకు పాజిటివ్ టాకే వినబడుతుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రాన్ని కొందరు నెటిజన్లు.. ‘టాలీవుడ్ కెజియఫ్ (Tollywood KGF), టాలీవుడ్ విక్రమ్ (Tollywood Vikram)’ అంటూ పోల్చడమే కాకుండా.. వన్ మ్యాన్ షో అంటూ నాగార్జున‌కు కితాబిస్తున్నారు. అయితే.. అక్కడక్కడ చిన్నపాటి నెగిటివ్ రివ్యూలు కూడా వినిపిస్తున్నాయి. ట్విట్టర్‌లో ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఎలా ఉందంటే.. 


- ‘ది ఘోస్ట్’ వన్ వర్డ్ రివ్యూ (One word Review): తమిళ్‌కి ‘విక్రమ్’ (Vikram).. తెలుగుకి ‘ది ఘోస్ట్’. సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అంటూ ఓ నెటిజన్ 3.75 రేటింగ్ ఇచ్చాడు. 


- ఇప్పుడే ఫస్టాఫ్ పూర్తయింది. టాలీవుడ్ కెజియఫ్, విక్రమ్. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) బ్రో.. రాంప్ ఆడేశావ్. కింగ్ అంటే ఒక్కడే.. అది నాగార్జునే. 


- సెంటిమెంట్, అద్భుతమైన సన్నివేశాలతో.. అలాగే బాషా సినిమా ఫ్లాష్‌బ్యాక్ లాంటి సీన్స్‌తో ఫస్టాఫ్ ఎక్స్‌లెంట్.. నాన్‌స్టాప్ యాక్షన్.. బ్లాక్‌బస్టర్ చర్చి ఫైట్‌తో సెకండాఫ్ అరుపులే..


- నాగార్జున కూడా ఈ యాక్షన్ డ్రామాని కాపాడలేకపోయారు. నాగార్జున, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి బలం. స్టో నేరేషన్, కొత్తదనం లేకపోవడం, సెకండాఫ్ సరిగా లేకపోవడం, అవసరంలేని సన్నివేశాలు.. ఈ సినిమా బలహీనతలు.


ఇలా.. నెటిజన్లు ట్విట్టర్ వేదికగా నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాపై రియాక్ట్ అవుతున్నారు. కాగా, నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్‌తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించిన ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ‘ది ఘోస్ట్’ సినిమా పూర్తి రివ్యూ మరి కాసేపట్లో..















Updated Date - 2022-10-05T16:49:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!