ఖుషీ.. ఖుషీగా..!

ABN , First Publish Date - 2022-05-17T05:52:19+05:30 IST

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి ‘ఖుషీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ...

ఖుషీ.. ఖుషీగా..!

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి ‘ఖుషీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. సినిమా టైటిల్‌  రివిల్‌ చేయడంతో పాటు  హీరోహీరోయిన్ల ఫస్ట్‌ లుక్‌ స్టిల్‌ విడుదల చేశారు. ఇందులో విజయ్‌, సమంత ఎంతో లవ్లీగా కనిపిస్తున్నారు. ప్రేమలో గెలిస్తేనే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు.. అంటూ సినిమా గురించి పేర్కొంది చిత్రబృందం. కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌, వైజాగ్‌, అలెప్పిలలో షూటింగ్‌ చేయనున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రంలో సచిన్‌ ఖేడేకర్‌, మురళీశర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య, ప్రదీప్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: దినేశ్‌ నరసింహన్‌, నిర్మాతలు: నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి.


Updated Date - 2022-05-17T05:52:19+05:30 IST

Read more