Khudiram Bose: పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేక ప్రదర్శన

ABN , First Publish Date - 2022-12-21T22:43:38+05:30 IST

ఈరోజు మ‌నం అనుభ‌విస్తున్న స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం ఎందరో మ‌హ‌నీయులు వారి ప్రాణాల‌ను తృణ ప్రాయంగా త్య‌జించారు. వారంద‌రిదీ ఒక్కో చ‌రిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒక‌రు. దేశం కోసం..

Khudiram Bose: పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేక ప్రదర్శన
Khudiram Bose

ఈరోజు ప్రజలు అనుభ‌విస్తున్న స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం ఎందరో మ‌హ‌నీయులు వారి ప్రాణాల‌ను తృణ ప్రాయంగా త్య‌జించారు. వారంద‌రిదీ ఒక్కో చ‌రిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒక‌రు. దేశం కోసం చిన్న వ‌య‌సులోనే ప్రాణ త్యాగం చేసి అమ‌రుడ‌య్యారు ఖుదీరామ్ బోస్‌ (Khudiram Bose). ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తుంది. ఆ ట్రెండ్‌లో పాన్ ఇండియా (Pan India) మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ (Golden Rain Productions) బ్యానర్‌పై డి.వి.ఎస్‌.రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జితా విజ‌య్ జాగర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ జాగ‌ర్ల‌మూడి (Rakesh Jagarlamudi) టైటిల్ పాత్ర‌లో న‌టించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవ‌ల గోవాలో జ‌రిగిన ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌దర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని పార్లమెంట్ సభ్యుల (Members of Parliament) కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.

డిసెంబ‌ర్ 22, గురువారం సాయంత్రం ఆరు గంటలకు ‘ఖుదీరామ్ బోస్‌’ చిత్రాన్ని గౌరవనీయులైన పార్లమెంట్‌ సభ్యులకు ప్రదర్శించబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా తెలియజేసింది. న్యూఢిల్లీ మహదేవ్‌ రోడ్‌లోని ఫిల్మ్స్ డివిజన్‌ ఆడిటోరియం (Films Division Auditorium in Delhi)లో ఈ ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి సంబంధిత ఫిల్మ్స్ డివిజన్‌ అన్నీ ఏర్పాట్లను చేయాలని.. మినిస్టరీ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ తరఫున ప్రభుత్వ సెక్రటరీ సురజిత్‌ ఇందు ఆదేశాలను జారీ చేశారు. కాగా, మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి బాలాదిత్య రైట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Updated Date - 2022-12-21T22:45:17+05:30 IST