కేజీఎఫ్ ట్రైలర్.. కరణ్ జోహార్ హోస్ట్!
ABN , First Publish Date - 2022-03-27T23:10:28+05:30 IST
కన్నడస్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ చిత్రం ఎంతగా ప్రేక్షకారణం పొందిందో తెలిసిందే! బాక్సాఫీస్ బద్దలయ్యేలా వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ చాప్టర్–2’ తెరకెక్కుతోంది. హోంబలే సంస్థ ఈసారి ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుంది. ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు

కన్నడస్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ చిత్రం ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే! బాక్సాఫీస్ బద్దలయ్యేలా వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ చాప్టర్–2’ తెరకెక్కుతోంది. హోంబలే సంస్థ ఈసారి ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుంది. ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో భారీగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అధీరాగా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ఇప్పటి బెంగళూరులోని వేదికకు చేరుకున్నారు. ఆయనతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు వేదిక దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. సంజయ్‌దత్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రధారులు. ప్యాన్ ఇండియా స్థాయిలో కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.