కేజీఎఫ్‌ నా సినిమా కాదు.. పూర్తి క్రెడిట్‌ ఆయనదే: యశ్‌!

ABN , First Publish Date - 2022-03-28T13:52:15+05:30 IST

‘కేజీఎఫ్‌’ చిత్రం విడుదలై దానికి సీక్వెల్‌ ‘కేజీఎఫ్‌ చాప్టర్‌–2’ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. పార్ట్‌ 1 సూపర్‌హిట్‌ కావడంతో చాప్టర్‌ 2 అంతకుమించి ఉండాలని అభిమానులు కోరుకున్నారు. ఆదివారం విడుదలైన ట్రైలర్‌ చూస్తే అభిమానుల కోరిక నిజమయ్యేట్లు ఉంది.

కేజీఎఫ్‌ నా సినిమా కాదు.. పూర్తి క్రెడిట్‌ ఆయనదే: యశ్‌!

‘కేజీఎఫ్‌’ చిత్రం విడుదలై దానికి సీక్వెల్‌ ‘కేజీఎఫ్‌ చాప్టర్‌–2’ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. పార్ట్‌ 1 సూపర్‌హిట్‌ కావడంతో చాప్టర్‌ 2 అంతకుమించి ఉండాలని అభిమానులు కోరుకున్నారు. ఆదివారం విడుదలైన ట్రైలర్‌ చూస్తే అభిమానుల కోరిక నిజమయ్యేట్లు ఉంది. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం బెంగుళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇదే వేదికపై దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించారు. 


అనంతరం యష్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఎనిమిదేళ్ల కష్టం. లైట్‌ మ్యాన్‌ దగ్గర నుంచి ప్రొడక్షన్‌ బాయ్‌ వరకు అందరూ దీని కోసం శ్రమించారు. వారి చెమట, రక్తాన్ని చిందించి మరీ సినిమా పూర్తి చేశారు. పేరుపేరున వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా. అయితే సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఆ క్రెడిత్‌ నా ఖాతాలో వేస్తారు. అది కరెక్ట్‌ కాదు. ఈ చిత్రం పూర్తిగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ది. నాది కాదు. సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా ఆయనకే చెందాలి. ప్రశాంత్‌ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ‘కేజీఎఫ్‌’ కన్నడ సినిమాకే గర్వకారణం’’ అని అన్నారు. Updated Date - 2022-03-28T13:52:15+05:30 IST