ఆ రెండూ నాకు నచ్చవు!
ABN, First Publish Date - 2022-10-08T05:30:00+05:30
‘‘చిన్నప్పుడు చాలా మొండిగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. ఏదైనా అనుకొంటే దాన్ని సాధించేంత వరకూ నిద్రపోను..’’
‘‘చిన్నప్పుడు చాలా మొండిగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. ఏదైనా అనుకొంటే దాన్ని సాధించేంత వరకూ నిద్రపోను..’’ అంటోంది కీర్తి సురేశ్. టాలీవుడ్లో బిజీ బిజీగా ఉంటున్న హీరోయిన్లలో కీర్తి పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ యేడాది ‘సర్కారు వారి పాట’తో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. ఇప్పుడు ‘దసరా’ కోసం నానితో జట్టు కట్టింది. మరోవైపు ఓటీటీలు, వెబ్ సిరీస్ స్ర్కిప్టులు కీర్తిని వెదుక్కొంటూ వెళ్తున్నాయి. ‘‘నా మొండితనం నాకు కొన్నిసార్లు ప్లస్ అయ్యింది. ఇంకొన్నిసార్లు మైనస్ అయ్యింది. సినిమాలే తీసుకోండి. ‘మహానటి’ సినిమా చేస్తున్నప్పుడు చాలామంది విమర్శించారు. ‘ఆ పాత్రకు కీర్తి సూటవ్వదు’ అన్నారు. కానీ నేను దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొన్నాను. కష్టపడ్డాను. దానికి తగిన ఫలితం వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. ‘నువ్వు ఈ పని చేయలేవు’ అంటే మొండితనం వచ్చేస్తుంటుంది. అయితే పరాజయాల్ని నేను పెద్దగా పట్టించుకోను. ప్రయత్నించి ఓడిపోవడంలోనూ ఆనందం ఉంటుంది. ప్రయత్నించకపోవడం, ఓటమికి భయపడి బరిలో దిగకపోవడం నాకు నచ్చని విషయాలు’’ అంటోంది.