Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త లుక్ చూస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2022-10-10T18:26:33+05:30 IST

'మహానటి' (Mahanati film released four years back) విడుదల అయి నాలుగేళ్లు అవుతున్నా కీర్తి సురేష్ (Keerthy Suresh) ని ఇంకా మహానటి సినిమాతోనే పిలుస్తూ వుంటారు.

Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త లుక్ చూస్తే షాక్ అవుతారు

'మహానటి'  (Mahanati film released four years back) విడుదల అయి నాలుగేళ్లు అవుతున్నా కీర్తి సురేష్ (Keerthy Suresh) ని ఇంకా మహానటి సినిమాతోనే పిలుస్తూ వుంటారు. ఆ తరువాత కీర్తి సురేష్ సినిమాలు చాల విడుదల అయ్యాయి కానీ, ఏ సినిమా కూడా 'మహానటి' అంత ప్రభావాన్ని చూపించలేక పోయాయి. ఆ 'మహానటి' సినిమా ప్రభావం అంత వుంది అన్నమాట. ఆ తరువాత చాల సినిమాలు కీర్తి సురేష్ ని ప్రధానంగా చేసుకొని వచ్చాయి, కానీ ఒక్కటీ కూడా సరిగ్గా ఆడలేదు. ఈ సంవత్సరం మహేష్ బాబు (Mahesh Babu) తో వచ్చిన 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) కూడా అనుకున్నంత విజయం సాధించలేదు కానీ, కీర్తి సురేష్ కి మంచి పేరు తీసుకు వచ్చింది. 


మహానటి సినిమా తరువాత, కీర్తి సురేష్ కి కొంచెం అలంటి పాత్రలే వచ్చాయి. అయితే కీర్తి సురేష్ తాను గ్లామర్ పాత్రలు (Keerthy Suresh wanted to play Glamour roles) కూడా బాగా చేస్తానని కూడా నిరూపించుకోవడానికి, చాల బరువు తగ్గి, మనిషి చాల అందంగా తయారయింది.  ఆ ఫోటోస్ ఆమె సాంఘీక మాధ్యమాల్లో విడుదల చేసింది. జాతీయ అవార్డు అందుకున్న ఈ నటి ఇప్పుడు మంచి కమర్షియల్ సినిమా చెయ్యడానికి చూస్తోంది.


తెలుగు లో చిరంజీవి (Mega Star Chiranjeevi) తో 'భోళా శంకర్' (Bhola Shankar) అనే సినిమాలో నటిస్తోంది. కానీ ఇందులో చిరంజీవి కి వ్యతిరేకంగా కథానాయికగా కాకుండా, చిరంజీవి కి చెల్లిగా (Chiranjeevi's sister) నటిస్తోంది. ఇంతకు ముందు రజనీకాంత్ (Rajanikanth) తో కూడా ఇలానే చెల్లిగా 'అన్నాత్తే ' అనే సినిమాలో నటించింది కానీ, ఆ సినిమా అంతలా ఆడలేదు. చెల్లి పాత్రలు ఆమెకి ఆచ్చి రాలేదు ఏమో. 


తెలుగులో ఆమె ''దసరా' (Dasara) చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ఇందులో నానీ (Actor Nani) పక్కన నటించింది. ఆమె నానితో చేస్తోన్న రెండో సినిమా ఇది. ఇంతకు ముందు 'నేను లోకల్' (Nenu Local) అనే సినిమా చేసింది, అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు 'దసరా' చేస్తోంది, ఇది ఎలా ఉంటుందో చూడాలి మరి. 

Updated Date - 2022-10-10T18:26:33+05:30 IST