Keerthi suresh: టెన్షన్‌.. టెన్షన్‌!

ABN , First Publish Date - 2022-05-09T01:43:33+05:30 IST

‘సర్కారు వారి పాట’ సినిమా విషయంలో కీర్తి సురేశ్‌ టెన్షన్‌ టెన్షన్‌గా ఉన్నారు! ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్‌ వేడుకలో కీర్తి మాట్లాడారు. టెన్షన్‌ పడటానికి గల కారణాలు చెప్పారు. ‘‘షూటింగ్‌ జరుగుతుండగా మహేశ్‌బాబు టైమింగ్‌ని ఎలా మ్యాచ్‌ చేయాలని టెన్షన్‌, డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు సినిమా చూసినప్పుడు అతని పక్కన గ్లామర్‌ను ఎలా మ్యాచ్‌ చేస్తానోనని టెన్షన్‌!

Keerthi suresh: టెన్షన్‌.. టెన్షన్‌!

‘సర్కారు వారి పాట’ సినిమా విషయంలో కీర్తి సురేశ్‌ (Keerthi suresh) టెన్షన్‌ టెన్షన్‌గా ఉన్నారు! ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్‌ వేడుకలో కీర్తి మాట్లాడారు. టెన్షన్‌ పడటానికి గల కారణాలు చెప్పారు. ‘‘షూటింగ్‌ జరుగుతుండగా మహేశ్‌బాబు (Maheshbabu) టైమింగ్‌ని ఎలా మ్యాచ్‌ చేయాలని టెన్షన్‌, డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు సినిమా చూసినప్పుడు అతని పక్కన గ్లామర్‌ను ఎలా మ్యాచ్‌ చేస్తానోనని టెన్షన్‌! వేదికపై అభిమానులు నన్ను మాట్లాడనిస్తారో లేదో అనే టెన్షన్‌. అభిమానులకు ఇదంతా సెలబ్రేషన్‌ కావచ్చు. కానీ నాకు మాత్రం టెన్షనే’’ అంటూ చెప్పుకొచ్చారు. కళావతి పాత్రను బహుమతిగా ఇచ్చినందుకు దర్శకుడు పరశురామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  


అభిమానులు మహేశ్‌ (Sarkaru vaari paata)సినిమా కోసం రెండేళ్లగా ఎదురుచూస్తున్నారని... కీర్తి అన్నారు. అందుకే ‘ఆయన ఉన్నారు.. ఆయన విన్నారు.. మీ అందరికోసం వస్తున్నారు. అందరూ థియేటర్‌లోనే సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి’ అని కీర్తి సురేశ్‌ అన్నారు. 


ఎప్పుడు వేదికలపై పెద్దగా మాట్లాడని కీర్తి ఈసారి ఇలా మాట్లాడటం పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. సినిమా సినిమాకు కీర్తిలో చలాకీతనం పెరుగుతోందనీ, మాటకారిగా కూడా మారిందని నెటిజన్లు అనుకుంటున్నారు. ‘మహానటి’ విజయం తర్వాత వరుస పరాజయాలు చవిచూసిన కీర్తి ఇప్పుడు ఆశలన్నీ ‘సర్కారువారి పాట’ (Sarkaru vaari paata) పైనే పెట్టుకున్నారు. 


Updated Date - 2022-05-09T01:43:33+05:30 IST