‘కట్టప్ప’కుమారుడి మిస్టరీ థ్రిల్లర్
ABN , First Publish Date - 2022-06-28T05:32:23+05:30 IST
‘కట్టప్ప’ సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా నటించిన ‘మాయెన్’ చిత్రం హక్కుల్ని మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు...
‘కట్టప్ప’ సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా నటించిన ‘మాయెన్’ చిత్రం హక్కుల్ని మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెల 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘పురాతన దేవాలయానికి సంబంధించిన ఓ రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూ్‌సతో రూపుదిద్దుకున్న మిస్టరీ థ్రిలర్ ‘మాయోన్’. గాడ్ వర్సెస్ సైన్స్ ఈ చిత్రం మెయిన్ థీమ్. నిర్మాత అరుణ్ మోజీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ. ఇందులో సిబిరాజ్ ఆర్కియాలజిస్ట్ పాత్ర పోషించారు. తాన్యా రవిచంద్రన్ ఎపిగ్రాఫి్స్టగా నటించారు. ఇటువంటి విజువల్ వండర్‌ను తెలుగు ప్రేక్షకులకు
అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు.