karthikeya-2: 100 కోట్ల క్లబ్‌లో నిఖిల్..!

ABN , First Publish Date - 2022-08-23T17:08:39+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’ (Karthikeya 2) 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళుతోంది. కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా చందు మొండేటి (Chandu Mondeti) తెరకెక్కించారు.

karthikeya-2: 100 కోట్ల క్లబ్‌లో నిఖిల్..!

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’ (Karthikeya 2) 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళుతోంది. కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా చందు మొండేటి (Chandu Mondeti) తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్‌గా శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో నటించారు. హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత యువత సినిమాతో హీరోగా మారాడు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం లాంటి సినిమాలు హీరోగా మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.


ఇక 2014లో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2తో సెన్షేషనల్ హిట్ అందుకున్నాడు. నిఖిల్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల మార్క్‌ను దాటే విధంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ దూసుకెళుతోంది. ఇక నిఖిల్ కెరీర్‌లో కూడా 100 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన సినిమాగా కార్తికేయ 2 మొదటిది కావడం విశేషం. ఈ సినిమా ఇప్పటివరకు కేవలం హిందీలోనే 15 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం గొప్ప విషయం.


ఇక ప్రపంచవ్యాప్తంగా 75.33 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమని బాక్సాఫీస్ వద్ద దూకుడు చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ వరకూ చూసుకుంటే, నిఖిల్ కెరియర్లోనే వేగంగా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా కార్తికేయ 2 నిలిచింది. మొత్తానికి నిఖిల్ ఊహించనివిధంగా భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, త్వరలో 18 పేజెస్ సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. 

Updated Date - 2022-08-23T17:08:39+05:30 IST

Read more